మోహన్ బాబు రెండవ కుమారుడి వివాహం నిశ్చయమైనట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే సహజంగా అమ్మాయిని చూడాలనే కుతూహలం చాలా మందికి కలుగుతుంది కదా... ఇదిగో నండి... మనోజ్ మనసు దోచిన ప్రణీత త్వరలో ఈ ఇరువురూ పెళ్ళి పీటలపైకి ఎక్కబోతున్నారు. ఈనెల 4న ఇరు కుటుంబాల వారు నిశ్చయతాంబూలాలు అందుకోనున్నారు. అందరూ ఎంతో ఎగ్సైటింగ్ గా ఎదురు చూస్తున్న ఈ అమ్మాయి ఫొటోను మామగారే ’నా మూడో కుమార్తె ఈమె’ అంటూ మోహన్‌బాబు తన రెండవ కోడలి ఫోటోను సోషల్ నెట్‌వర్క్స్ ద్వారా పరిచయం చేసారు. తన ఫియాన్సీ ప్రణీత రెడ్డిని తన లైఫ్ లవ్ అంటూ అందరికీ పరిచయం చేస్తున్నాడు. ఈ అమ్మాయి విష్ణు సతీమణి విరోనికాకు స్నేహితురాలు. అమెరికాలో సిఏ చేసిన ప్రణీత మనోజ్ కు రెండేళ్ళ క్రితమే పరిచయం.... పరిచయం ప్రేమగా మారి, పెద్దల అనుమతి తీసుకుని పెళ్ళితో ఒకటి కాబోతున్నారు.