రాంచరణ్ సినిమాకు చాలా గ్యాప్ వచ్చేసింది. చరణ్ శ్రీనువైట్ల తో చేస్తున్న సినిమా ’మైనేమ్ ఈజ్ రాజా’కు కథ సరిగా కుదరక కొన్నాళ్ళు ఆగారు. చివరికి కోన వెంకట్-గోపీమోహన్ ల జోక్యంతో కథ ఓ కొలిక్కి వచ్చినట్టుంది. ఈ సినిమాకు ఇక మార్చి ఐదునుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుందని ఈ చిత్ర యూనిట్ తెలిపింది. రెండు నెలలుగా దీని ప్రీ ప్రొడక్షన్ పనులతో యూనిట్ అంతా బిజీ అయిపోయింది. ఈ సినిమా ఇప్పటి వరకూ వచ్చిన శ్రీనువైట్ల సినిమాలా కాకుండా డిఫరెంట్ గా చేస్తున్నట్టు చిత్ర యూనిట్ చెబుతోంది. డివివి దానయ్య ఈ చిత్రానికి నిర్మాత కాగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ రవి చందర్ సంగీతం సమకూరుస్తున్నారు. రాంచరణ్ కల్పించుకోవడంతో శ్రీనువైట్ల కోన వెంకట్ లు రెండు సంవత్సరాల తరువాత తిరిగి ఈ సినిమాకు కలిసి పనిచేస్తున్నారు.