కాస్త బూతు కంటెంట్ ఉన్నప్పటికీ యూత్ ని ఆట్రాక్ట్ చేసే సబ్జెక్ట్ లతో ఆకర్షిస్తు వస్తున్నాడు దర్శకుడు మారుతి. కొత్త జోనర్ ప్రేమ కథలతో హిట్ లు కొడుతూ వస్తున్నాడు. అయితే ఇంతకాలం యువహీరోలతోనే పనిచేశాడీ దర్శకుడు. ఓ స్టార్ హీరోని డైరెక్ట్ చేసింది లేనేలేదు. కానీ ఆ మధ్య ఓసారి ఆ ఛాన్సొచ్చింది. విక్టరీ వెంకటేష్ హీరోగా 'రాధ' అనే చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు సాగాయి. చిత్రం షూటింగ్ కూడా సగంపైగా పూర్తయ్యింది. కానీ ఆ కథ నాది అంటూ వేరొక రచయిత అడ్డు చెప్పాడు. రచయితల సంఘంలో పెద్ద పంచాయితీ జరిగింది. దాంతో ఆ ప్రాజెక్టు వదులుకున్నాడు మారుతి.
కానీ పట్టువదలని విక్రమార్కుడిలా మరో సినిమాని తెరకెక్కించేందుకు ఇప్పుడు సన్నాహాలు చేస్తున్నాడు. మరో కథను రెడీ చేసుకుని వెంకీని కలిశాడుట. కథ కూడా ఓకే అయ్యిందని సమాచారం. ఈ కాంబినేషన్ లో త్వరలోనే సెట్స్ కి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆగిపోయిన సినిమాలోని ఒక్క సీన్ కూడా ఇందులో లేకుండా చూసుకుంటున్నాడట మారుతి. మొత్తానికి ఎక్కడ పోగోట్టుకున్నాడో అక్కడే రాబట్టుకుంటున్నాడు మారుతి. ఆల్ ది బెస్ట్.