‘కిక్ 2’ ఆడియో విడుదల

May 11, 2015 | 10:25 AM | 63 Views
ప్రింట్ కామెంట్
Kick_2_Audio_Function_Photos_niharonline

మాస్‌ మహారాజా రవితేజ, సురేందర్‌రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన ‘కిక్‌’ ఎంత సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందో అందరికీ తెలిసిందే. మళ్ళీ కిక్‌ టీమ్‌తో నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ బేనర్‌లో నందమూరి కళ్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్న చిత్రం ‘కిక్‌`2’. ఎస్‌.ఎస్‌.థమన్‌ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో జరిగింది.

ఈ కార్యక్రమంలో యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, రవితేజ, కళ్యాణ్‌రామ్‌, బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, రవికుమార్‌ చౌదరి, థమన్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌, సురేందర్‌ రెడ్డి, బోయపాటి శ్రీను, అనిల్‌ రావిపూడి, వక్కంతం వంశీ, రామ్‌ లక్ష్మణ్‌, బ్రహ్మానందం, రాజ్‌పాల్‌ యాదవ్‌, శ్రీనివాసరెడ్డి, సమీర్‌, పృథ్వి, షేర్‌ నిర్మాత కొమరం వెంకటేష్‌, శ్రీమణి, బాంబే బోలే, వరికుప్పల యాదగిరి, కాసర్ల శ్యామ్‌, రకుల్‌ ప్రీతసింగ్‌, పరుచూరి ప్రసాద్‌, ఎడిటర్‌ గౌతంరాజు, బాబీ, జంగ్లీ మ్యూజిక్‌ బ్రిజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

బోయపాటి శ్రీను థియేట్రికల్‌ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. బిగ్‌ సీడీని, ఆడియో సీడీలను యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ ఆవిష్కరించారు. తొలి సీడీని మాస్‌ మాహారాజా రవితేజకి అందించారు.  ఈ సందర్భంగా...

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ మాట్లాడుతూ ‘‘సీతారామరాజు షూటింగ్‌ టైమ్‌లో నిక్కర్లు వేసుకుని వెళ్లేవాడిని. అప్పటి నుండి రవితేజగారు నాకు తెలుసు. నేను ఆయన్ని రవన్న అని పిలిచేవాడిని. కొంతమంది పైకొస్తే మనసుకు ఆనందంగా ఉంటుంది. ఇక్కడ నేను అలా ఫీలయ్యే వక్తులు రవన్న, కళ్యాణ్‌ అన్నమాత్రమే. పేర్లు చెప్పుకోవడం కాదు. కష్టపడాలి అని అనుకునే వ్యక్తి కళ్యాణ్‌ అన్నే. ఎన్టీఆర్‌ మనవడిగా, హరికృష్ణ తనయుడుగా ఎప్పుడూ ఫీల్‌ కారు. అదే ఆయన సక్సెస్‌ సీక్రెట్‌. సినిమాల్లోకి రాకముందు నేను కె.బి.ఆర్‌.పార్క్‌లో నేను రన్నింగ్‌ వెళ్లేవాడిని. నేను ఒక రౌండ్‌ పరిగెత్తే లోపలే రవితేజగారు రెండు రౌండ్స్‌ వేసేవాడు.  అప్పుడు ఆయనతో మరోసారి పరిచయం అయింది. నేను ఒకసారి ఇడియట్‌ పోస్టర్‌ చూసి పోస్టర్‌ బాగుంది. నువ్వు బాగుండాలి రవన్నా అని ఫోన్‌ చేశాను. ఎందుకంటే అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కెరీర్‌ స్టార్ట్‌ చేసి నటుడిగా కెరీర్‌ను స్టార్ట్‌ చేసి ఇండస్ట్రీలో ఒక అగ్రకథానాయకుడిగా ఎదిగాడు. చాలా మంది తను ఇన్‌స్పిరేషన్‌గా నిలిచాడు. ఆయన ఎప్పుడూ ఇలాగే కష్టపడుతూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తూ మంచి సినిమాలు చేయాలి. సూరి సక్సెస్‌ఫుల్‌ దర్శకుడి కంటే మా ఫ్యామిలీ మనిషి అనుకుంటాం. ఇప్పటి వరకు తను చేసిన సినిమాలు వేరు. కిక్‌2 వేరు. దర్శకుడిగా పది మెట్లు పైకి ఎక్కించే సినిమా ఇది. థమన్‌తో మణిశర్మగారి దగ్గర పరిచయం. ఆడియో గురించి నేను చెప్పనక్కర్లేదు. మీకే తెలుస్తుంది. తన గురించి మాట్లాడుతుంటే మా తమ్ముడి గురించి మాట్లాడుతున్నట్లే ఉంటుంది. ఈ సినిమాకి మంచి కథను అందించిన వంశీకి థాంక్స్‌. పటాస్‌, టెంపర్‌ తర్వాత వస్తున్న కిక్‌2 సినిమాతో అన్నయ్య కళ్యాణ్‌రామ్‌ ముఖంలో చిరునవ్వు అలాగే ఉండాలి. ఇందులో పనిచేసిన ప్రతి ఆరిస్టు, టెక్నిషియన్‌కి ఈ సినిమా మంచి పేరుని తీసుకురావాలి’’ అన్నారు.

మాస్‌ మహారాజా రవితేజ మాట్లాడుతూ ‘‘కిక్‌2 ప్రేక్షకులకు డబుల్‌ కిక్‌ను ఇస్తుంది. రకుల్‌కి బ్రైట్‌ ఫ్యూచర్‌ ఉంటుంది. నాకు ఇష్టమైన వ్యక్తుల్లో కళ్యాణ్‌రామ్‌ ఒకరు. అన్‌ కాంప్రమైజ్‌డ్‌ నిర్మాత. మనోజ్‌ పరమహంస ఎక్స్‌ట్రార్డినరీ సినిమాటోగ్రఫీ  ఇచ్చాడు. కిక్‌తో సురేందర్‌రెడ్దితో ట్రావెల్‌ స్టార్‌ అయింది. ఆరేళ్ల తర్వాత కిక్‌2 చేస్తున్నాం. అన్నీ కుదిరితే కిక్‌3 చేయడానికి సిద్ధమే. థమన్‌ బ్యూటిఫుల్‌ మ్యూజిక్‌ ఇచ్చాడు. తనతో చేస్తున్న ఎనిమిదో సినిమా. సపోర్ట్‌ చేసిన ప్రతి ఒక ఆరిస్ట్‌, టెక్నిషియన్‌కి థాంక్స్‌’’ అన్నారు.

నందమూరి కళ్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ ‘‘సురేందర్‌రెడ్డి, రవితేజగారు కథ వినగానే ఒప్పుకున్నారు. మా బ్యానర్‌లో వస్తున్న ఏడో సినిమా. ప్రతి ఒకరికి థాంక్స్‌’’ అన్నారు.

కిక్‌ సురేందర్‌ రెడ్డి మాట్లాడుతూ ‘‘అతనొక్కడే రిలీజ్‌ అయి పది సంవత్సరాలైంది. కళ్యాణ్‌ గట్స్‌తో ఆ సినిమా చేశాడు. అలాగే కిక్‌2 కథ విని మంచి బడ్జెట్‌ ఇచ్చి ఈ సినిమాని చేశాడు. తను లేకుంటే కిక్‌2 లేదు. రవితేజతో కిక్‌3 చేయడానికి కూడా రెడీ.  ఎందుకంటే తనలో అంత ఎనర్జీ ఉంటుంది. ఈ సినిమా నాకు ఒక లెసన్‌. చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇలాంటి సినిమా చేస్తానో లేదో తెలియదు. రకుల్‌ నెంబర్‌వన్‌ పోజిషన్‌లో నిలబడుతుంది. లాంగ్‌రన్‌ ఉండే హీరోయిన్‌ అవుతుంది. థమన్‌ నేను ఆశించిన విధంగానే మరోసారి ఎక్సలెంట్‌ మ్యూజిక్‌ ఇచ్చాడు. సినిమా అందరినీ ఎంటర్‌టైన్‌ చేస్తుందని నమ్ముతున్నాను. మనోజ్‌ పరమహంసకి, ఆడియో రిలీజ్‌ చేసిన ఎన్టీఆర్‌గారికి థాంక్స్‌’’ అన్నారు.

బోయపాటి శ్రీను మాట్లాడుతూ ‘‘ట్రైలర్‌ అద్భుతంగా ఉంది. ఏది మాట్లాడినా తక్కువే అవుతుంది. టైటిల్‌కి సార్ధకత ఏర్పరిచిన ట్రైలర్‌. రవితేజతో భద్రతో నా ట్రావెల్‌ మొదలైంది. తను గురించి, తన వోల్టేజి గురించి నాకు బాగా తెలుసు. అద్భుతమైన ఎనర్జీ ఉన్న ఆర్టిస్ట్‌. సురేందర్‌రెడ్డి మంచి సినిమానే చేసుకుంటూ పోతున్న దర్శకుడు. ఈ సినిమా పెద్ద హిట్టై ఇండస్ట్రీకి ఊపరిగా నిలవాలి. థమన్‌ ఎంత మంచి మ్యూజిక్‌ ఇస్తాడో తెలుసు. తనతో నేను కూడా ఫస్ట్‌టైమ్‌ పనిచేస్తున్నాను. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పేరుతో బ్యానర్‌ను పెట్టి మంచి సినిమాలను చేస్తూ ముందుకు వెళుతున్నాడు. తన చివరి రక్తపుబొట్టు వరకు తన తాతగారి పేరు నిలబెడతాడు. ఎన్టీఆర్‌ దమ్ము గురించి నాకు తెలుసు. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అద్భుతమైన నటుల్లో తను ఒకడు. ఈ సినిమా ఆడియో, సినిమా పెద్ద హిట్టయి ఒక మంచి బ్యానర్‌ను పేరును మరోసారి నిలబెట్టాలని ఆశిస్తున్నాను’’ అన్నారు.

ఎస్‌.ఎస్‌.థమన్‌ మాట్లాడుతూ ‘‘మా కిక్‌, రెడ్‌బుల్‌ అంతా రవితేజగారే. ఈ సినిమాలో పదమూడేళ్ల అమ్మాయితో ఓ సాంగ్‌ను పాడిరచాను. ఈ ఎక్స్‌పెరిమెంట్‌ చేయడానికి సురేందర్‌రెడ్డి, కళ్యాణ్‌రామ్‌గారు బాగా ఎంకరేజ్‌ చేశారు. రవితేజగారితో ఎనిమిదవ సినిమా. సురేందర్‌రెడ్డిగారు, రవితేజగారితో కిక్‌ చేశాను. మరోసారి కిక్‌ ఇచ్చినందుకు థాంక్స్‌. సపోర్ట్‌ చేసిన అందరికీ థాంక్స్‌’’ అన్నారు.

రకుల్‌ ప్రీత్‌సింగ్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా చేయడం చాలా హ్యపీగా ఉంది. సురేందర్‌రెడ్డిగారు నాపై చాలా నమ్మకం పెట్టి ఎంకరేజ్‌ చేశారు. ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో నన్ను పార్ట్‌ చేసిన కళ్యాణ్‌రామ్‌గారు నన్ను పార్ట్‌ చేసినందుకు థాంక్స్‌. రవితేజగారితో వర్క్‌ చేయడం మంచి ఎక్స్‌పీరియెన్స్‌’’ అన్నారు.

బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా గ్యారంటీగా సూపర్‌డూపర్‌ హిట్‌ అవుతుంది’’ అన్నారు.

ఎ.యస్‌.రవికుమార్‌ చౌదరి మాట్లాడుతూ ‘‘చాలా మంచి కథ. నేను విన్నాను. కిక్‌ను మించిన కిక్‌ను ఈ చిత్రం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లో మరో హిట్‌ గ్యారంటీ’’ అన్నారు.

అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ ‘‘ఇది నందమూరి నామ సంవత్సరంగా ముందే చెప్పారు. నిర్మాతగా కూడా ఈ సినిమా పెద్ద సక్సెస్‌ ఇవ్వాలి. యూనిట్‌కి ఆల్‌ ది బెస్ట్‌’’ అన్నారు.

వక్కంతం వంశీ మాట్లాడుతూ ‘‘సురేందర్‌రెడ్డితో సినిమాకి పనిచేయడం ఆనందంగా ఉంది. తప్పకుండా ప్రేక్షకులకకు డబుల్‌కిక్‌ ఇచ్చే సినిమా అవుతుంది’’ అన్నారు.

బ్రహ్మానందం మాట్లాడుతూ ‘‘సురేంందర్‌ రెడ్డి మంచి స్టయిలిష్‌ డైరెక్టర్‌  అండ్‌ యాక్టర్‌. ఈ సినిమాని భారీగా నిర్మించడానికి గట్స్‌ కావాలి. ఆయనే కళ్యాణ్‌రామ్‌. రవితేజ, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఎక్సలెంట్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఇచ్చారు. థమన్‌ సాలిడ్‌ మ్యూజిక్‌ ఇచ్చాడు. తన మ్యూజిక్‌తో సినిమాని నెక్స్‌ట్‌ లెవల్‌కి తీసుకెళ్లాడు’’ అన్నారు.

లగడపాటి శ్రీధర్‌ మాట్లాడుతూ ‘‘నేను, కళ్యాణ్‌రామ్‌, సురేందర్‌రెడ్డి కలిసి ఓ సినిమా చేయాల్సింది. కానీ కుదరలేదు. త్వరలోనే మా కలయికలో ఓ సినిమా చేయాలని ఉంది. కిక్‌2 తెలుగు ఇండస్ట్రీకి హ్యుజ్‌ కిక్‌ ఇస్తుంది. థమన్‌ మ్యూజిక్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కళ్యాణ్‌రామ్‌ రాక్‌ చేస్తున్నారు’’ అన్నారు.

డైరెక్టర్‌ మల్లిఖార్జున్‌ మాట్లాడుతూ ‘‘నన్ను దర్శకుడిగా మార్చిన సంస్థ ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌. అరుదైన కాంబినేషన్‌. వేరే హీరోతో కళ్యాణ్‌రామ్‌గారు చేస్తున్న తొలి సినిమా ఇది. పెద్ద సక్సెస్‌ అయి మినిమమ్‌ ఆయనకు 50కోట్లు ప్రాఫిట్‌ రావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

రాజ్‌పాల్‌ యాదవ్‌ మాట్లాడుతూ ‘‘నా మొదటి తెలుగు సినిమా. మన దేశంలో వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ ఇండస్ట్రీ. నాకు పూర్తి కిక్‌ దొరికింది. సినిమా సూపర్‌హిట్‌ కావడం గ్యారంటీ’’ అన్నారు.

 

మాస్‌ మహారాజా రవితేజ సరసన రకుల్‌ప్రీత్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, సంగీతం: యస్‌.యస్‌.థమన్‌, సినిమాటోగ్రఫీ: మనోజ్‌ పరమహంస, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: నారాయణరెడ్డి, ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌, నిర్మాత నందమూరి కళ్యాణ్‌రామ్‌, స్క్రీన్‌ప్లే` దర్శకత్వం: సురేందర్‌రెడ్డి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ