తండ్రీ కూతుర్ల సవాల్

April 14, 2015 | 05:05 PM | 80 Views
ప్రింట్ కామెంట్
kamal_struthi_same_day_movies_release_niharonline

ఈ తండ్రి కూతుర్ల మధ్య పోటీ ఏంటని అనుకుంటున్నారా? ఏమీ లేదు వీరిద్దరి సినిమా ఒకే రోజు రిలీజవుతున్నాయి. ఎప్పుడూ ఇద్దరు హీరోల మధ్య పోటీ చూశాం... ఇద్దరు హీరోల సినిమాలు ఒకే రోజు విడుదలైతే అభిమానుల సందడి ఫైటింగ్ గట్రా ఇప్పటి వరకూ చూశాం... మరి ఈ తండ్రీ కూతుర్ల మధ్య పోటీ అనేది ఇప్పుడు కొత్తగా చూస్తున్నాం... ఈ యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ఉత్తమ విలన్ మే ఒకటిన విడుదలవుతోంది. అదే రోజున కూతురు శ్రుతి హాసన్ సినిమా గబ్బర్ ఈజ్ బాక్ విడుదలవుతోంది. అయితే రెండూ బాలీవుడ్ లో కాకపోయినా,  ఏ సినిమా ఎంత కలెక్షన్స్ రాబడుతోంది? ఎంత సక్సెస్ సాధించాయనేది అభిమానులు బేరీజు వేసుకుంటారు కదా... గబ్బర్ ఈజ్ బ్యాక్ అనే సినిమా తమిళ్ లో సక్సెస్ అయిన రామన్నకు రీ మేక్ గా తీసిన సినిమా. అక్షయ కుమార్ ఇందులో ప్రధాన పాత్ర చేస్తున్నాడు. కమల్ ఉత్తమ విలన్ కథ 8వ శతాబ్ధం నాటి థియేటర్ ఆర్టిస్టు, ఇప్పటి సూపర్ స్టార్ కు సంబంధించినది. ఇక ఈ రేస్ లో తండ్రి కూతుర్లలో ఎవరు ముందుకు దూసుకు వెళతారో వేచి చూద్దాం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ