తెలుగులో ‘కామసూత్ర’

September 15, 2015 | 03:24 PM | 2 Views
ప్రింట్ కామెంట్
kamasutra_movie_photos_niharonline_niiiiharonline2

1996లో ‘కామసూత్ర’ అనే సినిమాను సీనియర్ నటి రేఖ ప్రధాన పాత్రగా చిత్రీకరించారు. ఇప్పుడు అదే సిరీస్ లో మరో తాజా చిత్రం నిర్మించారు మీరానాయర్. కామ సూత్ర అనేది అరవై నాలుగు కళల్లో ముఖ్యమైన కళగా కొన్ని వందల సంవత్సరాల క్రితమే వాతాసయన గ్రంథంలో వివరించారు. ఆయన రాసిన ‘కామసూత్ర గ్రంధం’ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన గ్రంథం. వాత్సాయన విరచిత ‘కామసూత్ర’ను ఆధారంగా చేసుకొని, దానికి కొంత కాల్పనికత జోడించి ‘కామసూత్ర’ పేరుతోనే మీరా నాయర్‌ రూపొందిస్తున్న ‘కామసూత్ర సిరీస్‌’ సైతం ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రజాదరణ పొందుతున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ స్థాయిలో పలుమార్లు ప్రతిష్టాత్మక పురస్కారాలందుకొన్న మీరా నాయర్‌ తాజాగా తెరకెక్కించిన ‘కామసూత్ర’ త్వరలో తెలుగులో విడుదలకు సిద్ధమవుతోంది. నవీన్‌ అండ్రూస్‌, ఇందిరావర్మ, రామోన్‌ తికారం, సరితా చౌదరి, హరీష్‌ పటేల్‌ ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి ‘ఏ టేల్‌ ఆఫ్‌ లవ్‌’ అన్నది ట్యాగ్‌లైన్‌. ‘మీరా నాయర్‌ ఫిలింస్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌’ పతాకంపై మీరా నాయర్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెలుగులో రుషి పిక్చర్స్‌ అధినేత బలరాం శర్మ విడుదల చేస్తున్నారు. తార అనే రాణి- మాయ అనే రాజదాసి- రాజసింహ అనే రాజు మధ్య ఏర్పడిన ‘ప్రేమ-కామం-మోహం-ఈర్ష్య-ద్వేషం’ వంటి భావోద్వేగాల తాలూకు పర్యవసానాల సమ్మేళనంగా రూపొందిన ఈ తాజా ‘కామసూత్ర’లో మీరా నాయర్‌ తనదైన శైలిలో కామక్రీడలోని కొత్త కోణాలను సరికొత్తగా చూపించారు ఈ సినిమాలో.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ