చిరు తనయుడికి తిక్క కొంచెం ఎక్కువేనట

September 10, 2015 | 04:41 PM | 3 Views
ప్రింట్ కామెంట్
chiru-about-ram-charan-niharonline.jpg

చిరంజీవి 150వ చిత్రం గురించి ఆయన అభిమానులే కాదు, యావత్ సినీ లోకం ఎదురుచూస్తోంది. ఎనిమిదేళ్ల తర్వాత మెగా రీ ఎంట్రీ గురించి ఇటీవల 60వ పుట్టినరోజు సందర్భంగా దాదాపు ఖరారైంది. ఈ టైంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరు పలు ముచ్చట్లను మీడియాతో పంచుకున్నాడు. ఇన్నాళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న అవార్డుల కార్యక్రమంలో, ఆడియో పంక్షన్లో పాల్గొనడం ద్వారా తాను ఎన్నడూ ఇండస్ట్రీలోనే ఉన్నట్లు ఫీలయ్యాయని, తొందర్లనే తిరిగి ప్రేక్షకుల ముందుకు వస్తానని ప్రకటించాడు. ఇదే టైంలో తనయుడు  మెగా పవర్ స్టార్ రాంచరణ్ గురించి చిరు కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.

భార్య సురేఖ లేకపోతే తాను ఈరోజు ఇలా ఉండేవాడిని కాదని చెప్పిన ఆయన, ఆమె తర్వాత ఫ్యామిలీలో ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి చరణే అని అన్నారు. ఏదైనా సమస్య వస్తే తనకు తొడుగా నిలిచేది ముందు చెర్రీయేనట. అదే టైంలో చరణ్ కి కాస్త కోపం ఎక్కువేనని చెప్పుకొచ్చాడు. ఆ కోపం వల్ల ఏయే సమస్యలు కొని తెచ్చుకుంటాడోనన్న ఆందోళన తనలో ఎప్పుడూ ఉంటుందన్నారు. కానీ, అదే టైంలో చరణ్ బాధ్యతలను విస్మరించడని, ఏదైనా పని చేసే సమయంలో మెచ్యూర్డుగా వ్యవహారిస్తాడని చెప్పాడు. ప్రతి పుట్టినరోజుకి భార్య సురేఖతో ఎక్కడికైనా బయటికి వెళ్లే చిరుని ఈసారి ఇలా పెద్ద పండగలా జరపడం వెనుక ముఖ్యకారణం చరణేనట. చిరంజీవి ప్రతీ విషయంలో ఆచితూచి చరణ్ వ్యవరహారించి నిర్ణయాలన్నీ తీసుకుంటాడట. కానీ, చిరంజీవి మాత్రం చెర్రీ సినిమాల్లో అసలు వేలు పెట్టనే పెట్టడంట. కానీ, అదే టైంలో చరణ్ కి చిరు ఇచ్చిన సలహా ఏంటో తెల్సా? షూటింగ్ స్పాట్ లకు లేట్ వెళ్లకూడదని మాత్రమే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ