‘మెగా ప్రిన్స్’ వద్దంటున్న అభిమానులు

December 24, 2014 | 04:25 PM | 32 Views
ప్రింట్ కామెంట్

మెగా ఫామిలీ కొత్త హీరో సినిమా కోసం మొదటి రోజున జనాలు బారులు తీరి ఉదయం టిక్కెట్ల కోసం థియేటర్ల వద్ద బారులు తీరారు. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు నుండి U/A వచ్చింది. మెగాబ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ సినిమా కావడం, నిర్మాతలు ఠాగూర్ మధు, నల్లమలుపు బుజ్జి కావడంతో విడుదల భారీ ఎత్తున చేసారు. సాధారణంగా కొత్త హీరోలంటే థియేటర్లు తక్కువగా జనం వస్తారు. కానీ వరుణ్ తేజ్ మెగా ఫ్యామిలీ వాడు కావడంతో ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేశారు. అయితే ఈ కొత్త హీరోకి ఇచ్చే బిరుదు విషయంలో తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఈ ఫామిలీ హీరో పవన్ కళ్యాణ్ ‘పవర్ స్టార్' అయ్యాడు. అల్లు అర్జున్ ‘స్టైలిష్ స్టార్'గా పాపులర్ అయ్యాడు. రామ్ చరణ్ ‘మోగా పవర్ స్టార్' అయ్యాడు. వరుణ్ కు ‘మెగా ప్రిన్స్' బిరుదు ఇస్తూ ఆ మధ్య ఆడియో వేడుకలో చిరంజీవి స్వయంగా ప్రకటన చేసారు. అయితే ‘మెగా ప్రిన్స్' అనే పేరును అభిమానులు ఇష్ట పడటం లేదని తెలుస్తోంది. ప్రిన్స్ పదం మరేదైనా పెట్టాలనీ, ఒక అభిమాని ఆరడుగుల బుల్లెట్ అని కూడా సూచించారు. చివరికి ఏ పేరును డిసైడ్ చేస్తారో చూడాలి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ