ఒకప్పుడు అమ్మాయిలను సినిమా, మోడలింగ్ రంగానికి పంపడానికి జంకేవారు... అక్కడ పని చేసేవారిని చిన్న చూపు చూసేవారు కూడా. కానీ ఇప్పుడిప్పుడే రాయల్ ఫామిలీల నుంచి కూడా అమ్మాయిలు ఈ రంగం వైపు మొగ్గు చూపుతున్నారు. సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన తెలుగమ్మాయిలు ర్యాంప్ వాక్ లు చేసేస్తున్నారు. మారుతున్న సమాజానికి అనుగుణంగా తల్లిదండ్రుల్లోనూ మార్పులొస్తున్నాయి. నిజానికి వీరికి వెన్నుదన్నుగా వారు నిలిచినప్పుడు వారిని సమాజం గౌరవంగానే చూస్తుంది. ఇప్పుడు ఈ ట్రెండ్ ఊపందుకుందనడానికి మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన శ్రీసత్యే సాక్ష్యం. ప్రఖ్యాత సంగీతజ్ఞుడు మంగళం పల్లి బాలమురళికృష్ణ ఫ్యామిలీ నుంచి ఓ అమ్మాయి కథానాయికగా టాలీవుడ్ కి పరిచయం అవుతోంది. ఈ అమ్మాయి ఇప్పటికే మూడు సినిమాలకు కమిటైంది. జీనియస్ ఫేం హవీష్ సరసన ఓ సినిమా చేస్తోంది. అలాగే అవికా గోర్ తో కలిసి మరో సినిమాలో నటిస్తోంది. సత్య ఓ బిజినెస్ మేన్ కూతురు. మంగళంపల్లి శ్రీనివాస్-మంగళంపల్లి లలిత దంపతులకు జన్మించిన బిడ్డ. బాలమురళి కృష్ణ శ్రీసత్యకు తాతగారు. విజయవాడ స్వస్థలం. ఇప్పుడున్న హీరోయిన్లకు ఏవిధంగానూ తీసిపోను అందచందాలు పుష్కలంగా ఉన్నాయి ఈ అమ్మాయిలో. తనకు అందం మీద చాలా శ్రద్ధ. అదే అందాల పోటీల వైపు నడిపించింది. అలా ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగిన మిస్ విజయవాడ కాంపిటీషన్ లో కిరీటం అందుకుంది. ఆ తర్వాత సినిమాల్లో కెరీర్ ఎంచుకుంది.ప్రస్తుతం విజయవాడ లో బిబిఎ చదువుతోంది. తల్లిదండ్రుల ప్రోత్సాహం మెండుగా ఉన్న శ్రీసత్య మరిన్ని సినిమా ఆఫర్లు చేజిక్కించుకుని టాప్ స్టార్ స్థాయికి వెళ్ళాలని కోరుకుందాం...