ఒకప్పటి డాన్స్ సిరీస్ సినిమాల హీరో మిథున్ చక్రవర్తి ఆరోగ్యం బాగాలేదంటూ.... హాస్పిటల్ లో చేరాడన్న వార్తలకు ఫుల్ స్టాప్ పెడుతూ ఆయన కొడుకు మహాక్షయ్ చెప్పాడు. ఒకప్పటి హీరో, తృణమాల్ కాంగ్రెస్ ఎంపీ అయిన మిథున్ చక్రవర్తి జనరల్ చెక్ అప్ కోసం ఆస్పత్రికి వెళ్లాడని ఆయన కుమారుడు మహాక్షయ్ చెప్పారు. ఆస్పత్రిలో చేరినట్టు వచ్చిన వార్తలను ఆయన ఖండించాడు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందనీ, రెస్ట్ తీసుకుంటున్నట్టు తెలిపారు. కోట్లాది రూపాయల శారదా చిట్ ఫండ్ స్కాంకు సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇటీవల కోల్ కతాలో మిథున్ చక్రవర్తిని ప్రశ్నించారు. ఆ గ్రూపునకు ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేశారు. వీటికి సంబంధించిన డీవీడీలు, సీడీలు, రికార్డులను ఈడీ అధికారులకు అందజేశారు. శారదా గ్రూపు నుంచి తాను తీసుకున్న మొత్తాన్ని తిరిగి ఇస్తానని మిథున్ చక్రవర్తి ఇదివరకే చెప్పారు.