స్త్రీ అభ్యున్నతి మనందరి బాధ్యత - డా.యం.మోహన్ బాబు

April 06, 2015 | 01:15 PM | 22 Views
ప్రింట్ కామెంట్
Mohan_Babu_support_to_smruthi_irani_niharonline

కేంద్రమంత్రి స్మృతి ఇరాని  గోవాలోని ఓ దుస్తులు దుకాణంలో బట్టలు కొనడానికి వెళ్లి అక్కడ అమర్చిన రహస్య కెమెరాలను కనుగొని పోలీసులకు కంప్లైట్ చేసిన ఘటన కారుచిచ్చులా వ్యాపిస్తుంది. స్మృతి ఇరానికి బాసటగా అనేక మంది మద్ధతును తెలియజేస్తున్నారు. అందులో భాగంగా డా.యం.మోహన్ బాబు తన సపోర్ట్ ను సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రతిస్పందన తెలియజేస్తూ... ‘’స్మృతి ఇరాని గారికి ఎదురైన ఈ ఘటన గురించి తెలియగానే షాక్ కి గురయ్యాను. ఎవరైతే ఈ ఘోరం చేశారో ఆ దుర్మార్గుల అమ్మ కూడా ఒక స్త్రీ అని, ఒకవేళ వాళ్ల అమ్మగారికో, సోదరిమణులకో అలా జరిగితే ఆ పనిచేసిన వాడికి ఎలా ఉంటుందనే విషయం ఒకసారి ఆలోచించాలి. ఈ చర్యలకు పాల్పడిన వారిని వదలిపెట్టకూడదు. స్త్రీ అభ్యున్నతి మనందరి బాధ్యత. దానిలో మనం అందరం భాగస్వాములై వాళ్ల అభ్యున్నతికి పాటుపడాలి’’ అని తెలియజేశారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ