మా నూతన కార్యవర్గం ఎంపికైన తరువాత అధికారికంగా చేపట్టిన మొదటి కార్యక్రమం వృద్ధ కళాకారులకు పెన్షన్లు అందించడం. ‘మే’డే సందర్భాన్ని పురస్కరించుకొని 26 మంది వృద్ధ కళాకారులకు ఈ రోజు పెన్షన్లు అందించింది. హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పలువురు సీనియర్ నటులకు చెక్కులు అందించారు. ఈ సందర్భంగా మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా పేద కళాకారులకు పెన్షన్లు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు. తామిచ్చిన పెన్షన్ వారికి సరిపోదనేది తమకు తెలుసుననీ, ముందు ముందు ఆ మొత్తాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే అసోసియేషన్ తరఫున సేవా కార్య క్రమాలు ప్రారంభించామనీ, వాటిని మరింత పెంచుతామని అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.