అయ్యో... మూవీ మొఘల్ కి కాన్సర్ ఉందా?

January 31, 2015 | 11:27 AM | 43 Views
ప్రింట్ కామెంట్

తెలుగు సినీ పరిశ్రమకు ఏదో పట్టిపీడిస్తున్నట్లుంది. ఈ మధ్య తారలు ఒకరి తర్వాత ఒకరు హఠాత్తుగా చనిపోతున్నారు. ఇక గత కొద్దికాలంగా మూవీ మొఘల్ రామానాయుడి ఆరోగ్యం పరిస్థితి పై టాలీవుడ్ లో తీవ్ర చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్య స్థితిపై ఓ ఆందోళనకరమైన విషయం వెలుగుచూసింది. ఆయనుకు ప్రొస్టేట్ కాన్సర్ అట. దాదాపు 13 సంవత్సరాల క్రితమే ఆయనకు ఈ వ్యాధి సోకిందని, అయితే మందులు వాడుతుండటంతో తగ్గిన వ్యాధి ఇప్పుడు మళ్లీ తిరగబడిందని తెలుస్తోంది. దీంతో శరీరంపై అమిత ప్రభావం చూపే ఇంగ్లీష్ మందులను ఆపి ప్రత్నామ్నాయ మందులు వాడాలని ఆయన కుటుంబసభ్యులు నిర్ణయించారట. సినీ నటుడు, డాక్టర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో ఈ చికిత్స జరుగుతుండటం విశేషం. అంతేకాదు చికిత్సకు పెద్దాయన బాగానే స్పందిస్తున్నాడని సమాచారం. ఆనారోగ్యంతో ఉన్నప్పటికీ ఆయన మనసంతా సినిమాలపైనే ఉందని, ఈ విషయాలపై రోజూ తమను అడుగుతున్నారని ఆయన తనయుడు, నటుడు విక్టరీ వెంకటేష్ మీడియాకు తెలిపాడు. త్వరగా కొలుకొని ఆయన మన మధ్యకు రావాలని నీహార్ ఆన్ లైన్ తరపునుంచి ఆశిద్ధాం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ