హీరో ఎంత పొట్టోడు అయినా, ఎంత పొట్ట ఉన్నా కానీ, కండలు తిరిగిన విలన్‌ని వదిలేసి హీరోయిన్ ఖచ్చితంగా హీరోనే ప్రేమిస్తుంది. ఎంత ట్రై చేసినా విలన్లకి హీరోయిన్‌తో రొమాన్స్ చేసే ఛాన్స్ మన సినిమాల్లో అయితే రాదు. అయితే తెరపై విలన్ వేషాలేసే రాహుల్ దేవ్ కి నిజజీవితంలో ఓ సెక్సీ హీరోయిన్ దొరికిందండోయ్. ఫ్యాషన్ ఫేమ్ ముగ్ధా గాడ్సే రాహుల్ దేవ్‌తో పీకల లోతుదాకా ప్రేమలో ఉందట. వీరిద్దరూ కలిసే ప్రతీ కార్యక్రమానికి హాజరవుతున్నారని, వీరిద్దరి మధ్య సంబంధం స్నేహం అని చెప్పుకున్నప్పటికీ అంతకు మించి అని అప్పట్లో బాలీవుడ్ మీడియా కోడై కూసింది. ఇప్పుడు దానిని కన్ఫర్మ్ చేశారు వారిద్దరూ. ఓ స్విమ్మింగ్ పూల్ దగ్గర క్లోజ్ గా ఉన్న ఫోటోనోకదానిని ముగ్థా ట్విట్టర్లో పోస్ట్ చేసింది. మొత్తానికి కెరీర్ అంత జోరులో ఏం లేని అమ్మడు ఈ మిడిల్ ఏజ్ విలన్‌లో తనకి కావాల్సిన వాటిని వెతుక్కుందని సినీ వర్గాలు కామెంట్లు చేస్తున్నాయి. ఇప్పటికీ రాహుల్ దేవ్ కి తెలుగులో అడపాదడపా వేషాలు వస్తూనే ఉన్నాయి. ఖాళీ టైంలో మాత్రం ముంబై చెక్కేసి ఇలా ముగ్థ ముచ్చట్లో తడిసి పోతున్నాడన్నమాట.