చూపించమంటే ఈసారికి నో చెప్పాడు

December 19, 2014 | 05:42 PM | 51 Views
ప్రింట్ కామెంట్

ఈ ఏడాది మొదట్లో వచ్చిన మహేష్ బాబు వన్-నేనోక్కడినే చిత్రం. హాలీవుడ్ తరహాలో తెరకెక్కిన ఈ చిత్రం పరాజయం పాలైన ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని పంచింది. ఇక ఈ చిత్రంలో మరీ చెప్పుకోవాల్సింది మహేష్ షర్ట్ లెస్ గా నటించడం. ఓ సీన్లో షవర్ బాత్ చేస్తూ వీపును చూపిస్తాడు. ఇక మ్యాటరెంటంటే ఆ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ఈ సూపర్ స్టార్ మరోసారి షర్ట్ లెస్ గా కనిపించోద్దని డిసైడ్ అయ్యాడట. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో మహేష్ షర్ట్ లెస్ గా కనిపించడానికి నిరాకరించాడని సమాచారం. తొలుత కథ అనుకున్న సమయంలో కాకుండా చిత్రీకరణ సమయంలో సిచ్యూయేషన్ కు బాగుంటుందని దర్శకుడు మహేష్ ను షర్ట్ లేకుండా కనిపించాలని కోరాడట. దీనికి మహేష్ సుతరాగా నో చెప్పాడని తెలుస్తోంది. ఓవైపు ఎన్టీఆర్ కూడా సిక్స్ పాక్ తో చించేస్తుంటే... మరీ స్టామినా మహేష్ లాంటి హీరో మళ్లీ ఎప్పుడు షర్ట్ లెస్ గా కనిపిస్తాడా అని అభిమానులు ఎదురుచూస్తూంటే... మనోడు వాళ్ల ఆశలపై ఇలా నీళ్లు జల్లుతున్నాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ