సైంధవి నుంచి ఎలాంటి షరతులూ లేవు: జి.వి.ప్రకాష్

March 09, 2015 | 05:06 PM | 43 Views
ప్రింట్ కామెంట్
gvpraksh_saindhavi_niharonline

మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నాడు ఆయన అల్లుడు జి.వి.ప్రకాష్. ఈయన కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి స్థానంలోనే ఉన్నాడు. అసలు పెళ్ళయ్యిందా ఈ కుర్రాడికి? అనుకునేంతలా చిన్న పిల్లాడిలా కనిపించే ప్రకాశ్ 2013లో సైంధవిని ప్రేమ పెళ్ళి చేసుకున్నాడట. ఈ మ్యూజిక్ డైరెక్టర్ కు నటించాలనే కోరిక కలిగింది. నటుడిగా కూడా నిరూపించుకునే ప్రయత్నం మొదలుపెట్టాడు. దీనికి భార్య సహకారం తోడైంది. త్వరలో ఈ యువ సంగీత దర్శకుడు 'పెన్సిల్' అనే చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్నాడట. ఈ చిత్రానికి గౌతం మీనన్ దగ్గర అసోసియేట్ గా పని చేసిన మణి నాగరాజు దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ చిత్రంలో జీవీ ప్రకాష్ ఇంటర్మీడియట్ కుర్రాడిగా నటిస్తున్నాడు. అతని ప్రియురాలిగా శ్రీదివ్య నటిస్తోంది. అయితే సినిమాల్లోకి ఎంటర్ అవుతున్నా కదా అని, తనను హీరోగా అనుకోవద్దని సంగీతం అందించడమే తనకు మొదటి ఇష్టమైన రంగమని చెబుతున్నాడు. కొన్నాళ్ళు హీరోగా సరదా తీర్చుకుని సంగీత దర్శకుడిగానే లైఫ్ టైమ్ కొనసాగుతానని అంటున్నాడు. అయితే హీరో అవుతున్నతనకు తన భార్య కండిషన్లు చాలా పెట్టిందన్న వార్తలో నిజం లేదని తేల్చాడు ప్రకాష్.. ఎలాంటి షరతులూ తనకు పెట్టలేదనీ, ఏ విధంగా నటించడానికైనా తాను ఓకే అని చెప్పేశాడు ప్రకాశ్.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ