కోటి తనయుడు ‘ప్రేమంటే సులువు కాదు(రా)’ అంటున్నాడు

August 25, 2015 | 11:38 AM | 3 Views
ప్రింట్ కామెంట్
premante_suluvu_kadura_movie_niharonline

సినీ వారసుల ట్రెండ్ నడుస్తోందిప్పుడు... అయితే ఇక్కడ ఒక కరెక్షన్... దర్శకులు, రైటర్లు, సింగర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు ఎన్నో ఫీల్డ్స్ ఉన్నాయి సినిమా రంగంలో... కానీ అందరినీ ఎట్రాక్టివ్ చేసేది మాత్రం హీరోలు, హీరోయిన్లు... అందుకే పాటగాళ్ళనూ, ఆటగాళ్ళనూ... ఆకర్షిస్తోంది సిల్వర్ స్క్రీన్! ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ప్రముఖ సంగీత దర్శకుడు కోటి గారి తనయుడు కూడా హీరో అవడం గురించి... మరి ఈయన తన కుమారుణ్ణి సంగీత దర్శకుడిగా కాకుండా హీరోగా తెరమీద చూసుకోవాలనుకుంటున్నాడు... కోటి తనయుడు రాజీవ్ గోవిందరెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. రాజీవ్ కు జతగా సిమ్మదాస్ నటిస్తోంది. ఆర్‌పి ప్రొడక్షన్స్ పతాకంపై భవనాసి రామ్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమంటే సులువు కాదురా’. ఈ చిత్రం షూటింగ్ పూర్తయిన సందర్భంగా చిత్ర నిర్మాత భవనాసి రాంప్రసాద్ వివరాలను తెలియజేస్తూ ఆటో నడుపుకునే అబ్బాయికి ఇంజనీరింగ్ చదువుకునే అమ్మాయికి ఏర్పడిన ప్రేమ ఎలాంటి పరిణామాలకు దారి తీసిందనే ఆసక్తికర కథాంశంతో తెరకెక్కుతున్న ప్రేమ కథా చిత్రం ఇదని అన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోందని, ఇప్పటి వరకు తెలుగులో వచ్చిన ప్రేమకథా చిత్రాలకు భిన్నంగా ఉంటుందని చెప్పారు. అందరికీ నచ్చే అన్ని రకాల కమర్షియల్ అంశాలతో తెరకెక్కే ఈ చిత్రంలోని పాటలను త్వరలోనే విడుదల చేస్తామని అన్నారు. ఈ చిత్రానికి మాటలు గోవిందరెడ్డి, సుమన్. సంగీతం-నందన్‌రాజ్, కెమెరా-సురేష్, ఎడిటింగ్-ఎస్.డి.ఉద్దవ్, సహనిర్మాతలు-కోమారి సుధాకరరెడ్డి, శ్రీపతి శ్రీరాములు, నిర్మాత-బి.రాంప్రసాద్, దర్శకత్వం-చందా గోవిందరెడ్డి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ