ఏంటీ ఈ చిరు గొడవలు... అది కూడా నీహారిక స్టార్ట్ చేసిందా? ఇదేదో చిరు ఫామిలీ గొడవల్లా అనిపిస్తోంది కదా.... కానీ అలాంటిదేం లేదు. ఇదో స్టూడెంట్స్ గోల... అన్నపూర్ణ ఫిలిం స్కూల్ స్టూడెంట్స్ అందరూ కలిసి మార్కెట్ లో వారి క్రియేటివిటీ ని చూపించడం కోసం ఒక సినిమాని తీస్తున్నారు. త్రికరన్ రెడ్డి దర్శకత్వంలో అన్నపూర్ణ స్కూల్ స్టూడెంట్స్ అంతా కలిసి నటిస్తున్న ఈ సినిమాకి ‘చిరు గొడవలు ‘ అనే టైటిల్ పెట్టారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల కాగా, తాజాగా సినిమాకు సంబంధించిన వెబ్ సైట్ ను నాగ బాబు కూతురు నిహారిక చేతుల మీదుగా లాంచ్ చేయించారు. అప్పట్లో ఫస్ట్ లుక్ విడుదలైనప్పుడు బ్యాగ్రౌండ్లో చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఫోటోలు పెట్టడంతో ఈ సినిమాలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన చిన్న చిన్న గొడవల అంశం ఉంటుందేమో అని భావించారు... ‘చిరు’ అంటే చాలు చిరంజీవి అన్నట్టే ఈ సినిమా ఫీల్డులో... అయితే ఈ సినిమా టైటిల్ అలా ఉంది మరి... కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందు రాబోతుందీ సినిమా. స్టూడెంట్స్ సినిమా అంటే కాలేజీ స్టూడెంట్స్ ఎగబడి చూస్తారుగా మరి... నిర్మాత అచ్యుత్ చోపడే మాట్లాడుతూ ‘ఈ సినిమా యూత్ కు నచ్చే విధంగా ఉంటుందని, రొమాంటిక్ అంశాలతో పాటు, కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తా’యని తెలిపారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.