అక్కడో పెద్ద కార్యక్రమం జరుగుతున్నప్పుడు దానికి సంబంధించిన స్పందనలు కాకుండా అక్కడ లేని వారి గురించి కేకలు వినిపిస్తే... కాస్త కోపం వస్తుంది మరీ... చిరు బర్త్ డే వేడుకలో ఇలాంటి సంఘటనే జరిగింది. ప్రతీసారీ ఇలాంటి మెగీ హీరోల ఫంక్షన్లు జరగడం... అక్కడికి పవన్ కళ్యాణ్ హాజరు కాకపోవడం... అది పవన్ అభిమానులకు తెలిసినా... ఆ వేడుకలకు వారు తరలి రావడం జరుగుతూనే ఉంది. కానీ వాళ్ళు ఊరికే ఉండకుండా... పవర్ స్టార్ అని అరవడం... ఫంక్షన్ కు కాస్త డిస్టబెన్స్ గా మారుతోంది. ఇది ఎన్నాళ్ళ నుంచో జరుగుతోంది. ఇది ఎన్నాళ్ళని సహిస్తారు. ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మెగా బ్రదర్ నాగబాబు రూపంలో దూసుకొచ్చింది. ‘‘జరిగే ప్రతి కార్యక్రమానికి మేము వాడిని పిలుస్తాం... కాని ఫ్యామిలీ ఫంక్షన్లకు వాడు రాడు. వాడెందుకు రాడో వాడికే తెలియాలి. మీరు ఇలా ఈవెంట్లలో పవర్ స్టార్ అని అరుస్తూ గోల చేసేబదులు మీకు దమ్ముంటే వెళ్ళి పవర్ స్టార్ ఆఫీస్ దగ్గర ఇంటి దగ్గర అరవండి. ఎందుకు రాడో కనుక్కోండి. అంతేకాని ఇక్కడ ఫంక్షన్లను డిస్ట్రబ్ చేయకండి. చాన్నాళ్ళ నుండి చూస్తున్నాం .. ఇక భరించలేం.'' అంటూ నాగబాబు తేల్చి చెప్పేశారు.
అయినా వేరే ఛానళ్ల 20 ఏళ్ళ సంబరాలకు, వేరే యంగ్ హీరోల ఆడియో లాంచ్ లకు కూడా వెళ్ళే పవన్ కళ్యాణ్. సొంత ఫ్యామిలీ సంబరాలకు ఎందుకు రావట్లేదని నిజంగానే ఆయనకే తెలియాలి. గతంలో ఎన్నోసార్లు మెగా ఫ్యామిలీ హీరోలందరూ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. అయితే పవన్ మాత్రం ఎన్నడూ దీనిపై స్పందించకపోగా, ఈ మ్యాటర్ పై కనీసం ఇంటర్యూ లు కూడా ఇవ్వట్లేదని మీడియా వర్గాలు చెబుతున్నాయి.