అంటే నాగార్జున ఏదో దీక్ష పడుతున్నాడనుకుంటున్నారేమో... అది కాదండీ... ఆయన గతంలో ఎన్నో భక్తిరస చిత్రాలు చేసి, ప్రేక్షకులను మెప్పించాడు. ఇప్పుడు కూడా అదే ప్రయత్నమన్నమాట. ఈయన చేసిన భక్తరామదాసు, అన్నమయ్య, షిర్డి సాయి బాబా అన్నీ బాక్సాఫీస్ సక్సెస్ సినిమాలే. ఇప్పుడు కొత్తగా మరో భక్తి చిత్రం... ఇంతకుముందు కూడా ఈ వార్త వచ్చింది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వెంకటేశ్వర స్వామి భక్తుడు హాతీరామ్ బావాజీ పాత్ర ను నాగార్జున చేయబోతున్నాడనీ, ఇప్పుడు కూడా అదే వార్త మళ్ళీ వినిపిస్తోంది. ఈ కథ జెకె భారవీ రాస్తున్నారు. దీనికి సంగీతాన్ని ఎం.ఎం.కీరవాణి అందిస్తున్నారు. ఇప్పుడు సోగ్గాడే చిన్ని నాయనా సినిమా షూటింగ్ నాగార్జున బిజీగా ఉన్నారు. ఈ సినిమాను కొత్త డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా, అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్ పై నాగార్జున ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరో విశేషం ఏమిటంటే ఇందులో నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అయితే తండ్రి కొడుకులుగా కాదట తాత మనవళ్ళ పాత్రల్లో నటిస్తున్నాడని తెలుస్తోంది.