సాధారణంగా భక్తిరస చిత్రాల్లో నటించిన నటులను తిరిగి సోషల్ సినిమాల్లో చూడలేరు. కానీ అదేమిటో ఈ నటుడు ఎన్ని రకాల పాత్రలు చేసినా తిరిగి ఓ మన్మథుడిలా చూడగలుగుతున్నారు. నాగార్జున ‘అన్నమయ్య’లో నటిస్తున్నాడనే సరికి ’బాబోయ్ నాగార్జునను ఇలా చూడాలా?’ అని అమ్మాయిలు గగ్గోలు పెట్టారు. కానీ సినిమా విడుదలయ్యాక చూసి, నాగార్జునను ఎలా ఉన్నా చూడొచ్చు అనే మెండ్ సెట్ లోకి మారిపోయారు. ఆ తరువాత శ్రీరామదాసు, శిరిడీ సాయి సినిమాలను కూడా సక్సెస్ చేశారు. తాజాగా మరో భక్తిరస చిత్రంలో నాగార్జునను చూపించాలని రాఘవేంద్రరావు సిద్ధమైపోతున్నారు. దీని గురించి కొంత కాలంగా చర్చలు కూడా నడుస్తున్నాయట. వెంకటేశ్వర స్వామిగా నటిస్తారనే వార్తలు కూడా ప్రచారమయ్యాయి. కానీ అది వాస్తవం కాదంటున్నారు. ఈ ఆధ్యాత్మిక చిత్రంలో ఆయన కృష్ణిడిగా నటిస్తున్నారట. ఈ టైటిల్ ను కూడా ‘కృష్ణమయ్య’గా పెట్టాలని అనుకుంటున్నారు. ఈ సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయనీ, ఏప్రిల్, మేల్లో షూటింగ్ జరుపుకోవచ్చని తెలుస్తోంది. అధికారిక వివరాల కోసం వెయిట్ చేద్దాం.