చై మెచ్చిన అమ్మాయితోనే పెళ్ళిచేస్తాడట....

September 12, 2015 | 05:51 PM | 2 Views
ప్రింట్ కామెంట్
nagarjuna_about_chai_marriage_niharonline

అక్కినేని నాగార్జున ఇద్దరు కొడుకుల్నీ సినిమాల్లోకి దింపేశాడు. కెరీర్ పరంగా ఇద్దరు కొడుకులూ ఇండస్ట్రీలో క్లిక్ అయిపోయినట్టే లెక్క. ఇప్పుడు పెద్ద కుమారుడు నాగచైతన్య పెళ్ళి విషయంలో తండ్రీ కొడుకులకు లేని ఆరాటం మీడియావాళ్ళల్లో, అభిమానుల్లో కనిపిస్తుంది. ఈ మధ్య నాగచైతన్య పెళ్ళెప్పుడని? ఇటు తండ్రినీ, అటు నాగచైతన్యను ప్రశ్నలతో వేధిస్తున్నారు. దానికి అక్కినేని నాగార్జున క్లియర్ గా తన మనో భావాన్ని బయట పెట్టేశాడు. కొడుకు పెళ్ళి విషయంలో తనేలాంటి చొరవ తీసుకోబోనని నాగార్జున డైరెక్ట్ గా చెప్పేశాడు. నాగచైతన్యకు ఎలాంటి అమ్మాయి కావాలో తనకే తెలియాలంటున్నాడు. ఎవరి భార్యను వారే వెతుక్కోవాలి. నాగ చైతన్య కూడా తనకు కాబోయే భార్యను తనే చూసుకోవాలి. ఎవరైనా అమ్మాయిని ప్రేమించానని చెబితే వెంటనే పెళ్లి చేయడానికి తాను రెడీ అని కూడా నాగార్జున చెప్పేస్తున్నాడు. ఇంత క్లారిటీగా ఉండడానికి కారణం తనే అంటున్నాడు. చేసుకునే వారి ప్రమేయం లేకుండా పెద్ద కుదిర్చిన పెళ్లి సంబంధాలు ఎక్కువ కాలం నిలబడవంటున్నాడు. ముఖ్యంగా సినిమా రంగంలో ఉండే వారికి ప్రేమించి పెళ్లి చేసుకుంటేనే ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారంటున్నాడు. నాగార్జున మొదటి వివాహం పెద్దలు కుదిర్చిన వివాహం. వీరికి కలిగిన సంతానమే నాగ చైతన్య. పలు కారణాల వల్ల వీరు విడిపోయారు. తర్వాత తన సహ నటి అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇండస్ట్రీలోని వారంతా ప్రేమించి పెళ్ళి చేసుకున్న వారే హాపీగా ఉంటున్నారని ఆయన భావన. కానీ ఇది కూడా కరెక్టు కాకపోవచ్చునేమో... ప్రేమించి పెళ్ళి చేసుకున్న వారూ విడిపోయారు. అలా అని పెద్దలు కుదిర్చిన వివాహాలు చేసుకున్న స్టార్లు హాపీగా ఉన్న వారూ ఉన్నారు నాగార్జునగారూ....

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ