బ్రూస్ లీ సినిమా తరువాత రాం చరణ్ ఓ తమిళ రీమేక్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో నాగార్జున ఓ రోల్ చేస్తున్నట్టు ఫిల్మ్ నగర్ లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఈ వార్త ఇటు మెగా అభిమానులనూ అక్కినేని అభిమానులనూ ఆశ్చర్యంలో ముంచేస్తోంది. ‘తని ఒరువన్’ అనే తమిళ సినిమా అక్కడ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇదే సినిమాలో రాంచరన్ తెలుగులో హీరోగా నటిస్తున్నాడు. అయితే ఇందులో ఒకప్పుడు హీరోగా నటించిన కోలీ వుడ్ మన్మథుడు అరవింద్ స్వామి విలన్ గా చేసి తమిళులను విపరీతంగా ఆకర్షించాడు. మరి తెలుగు మన్మథుడంటే ఎవరండీ? మన నాగార్జున గారేగా అందుకే ఆయనను ఈ రోల్ లో తీసుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను చూసిన నాగార్జున కూడా ఈ విలనీ పాత్ర చేసి మెప్పించాలని అనుకుంటున్నాడట. ఆయనకు ఈ రోల్ బాగా నచ్చి ఒకే చెప్పినట్టు కూడా ఫిల్మ్ నగర్ టాక్. ఇదే గానీ నిజమైతే ఈ చిత్రం అక్కినేని, మెగా కాంబినేషన్ లో వస్తున్న మొదటి చిత్రం అవుతుంది.