నాగార్జున ‘ఊపిరి’ ఎప్పుడో?

October 21, 2015 | 04:13 PM | 3 Views
ప్రింట్ కామెంట్
nagarjuna-karthi-oopiri-movie-january-release-niharonline_(1)

ఇప్పటివరకూ కనిపించిన పోస్టర్లలో నాగార్జున వీల్ ఛైర్ లోనే ఉన్నాడు. ఈ సినిమా మొత్తం ఇలానే కనిపిస్తాడా...? లేక నడుస్తూ కనిపిస్తాడా? ఈ వీల్ ఛైర్ నాటకమా? నిజమా? ఇలాంటి డౌట్స్ తో నాగార్జున అభిమానులు ఊపిరి బిగబట్టి మరీ ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. నాగార్జున అభిమానులు ఆయన సినిమా 'ఊపిరి' గురించి ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశం లేదనే టాక్ వినిపిస్తోంది. షూటింగ్ విషయంలో జరిగిన ఆలస్యమే ఇందుకు కారణమని చెబుతున్నారు. నాగార్జున, కార్తీ , తమన్నా కాంబినేషన్లో ఈ సినిమా రూపొందుతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా, ఎక్కువ భాగం విదేశాల్లోనే షూటింగ్ జరుపుకుంది. ఇప్పటివరకూ 80 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. 
ఈ నెల చివరన తాజా షెడ్యూల్ ను ఆరంభించి, వచ్చేనెలలో షూటింగ్ పార్టును పూర్తి చేయనున్నారు. ఆ తరువాత మిగతా కార్యక్రమాలను పూర్తి చేసి, వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో దర్శకనిర్మాతలు ఉన్నట్టుగా సమాచారం. నవంబర్ లో అఖిల్, డిసెంబర్లో నాగచైతన్య .ఆడియన్స్ ను పలకరిస్తే, జనవరిలో నాగార్జున అలరించే అవకాశం ఉందన్నమాట.

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ