మనం అన్నది అబద్ధం...

April 15, 2015 | 04:24 PM | 42 Views
ప్రింట్ కామెంట్
nagarjuna_chanel_rumor_niharonine

ఇటీవల మా టీవీ నెట్వర్క్ ఛానల్స్‌ ను స్టార్ ఇండియా వారు భారీ ఒప్పందం చేసుకున్నారన్న సంగతి అందరికీ తెలిసిందే. దీంతో నాగార్జున మరికొందరితో కలిసి మరో కొత్త ఛానెల్ ప్రారంభిస్తున్నట్టు దాని పేరు ‘మనం’ అని పెడుతున్నట్టు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ వార్తలను ఇన్నాళ్ళకు నాగార్జున తోసిపుచ్చాడు. అదంతా అబద్దమనీ నాగార్జున తేల్చి చెప్పారు. ఆయన ఆధ్వర్యంలో ‘మనం’ పేరిట ఓ ఛానెల్ వస్తోందని, ఈనెల 24న దీన్ని ప్రారంభిస్తారని రెండురోజుల కిందట ప్రచారం జరిగింది.  ‘మా’ టీవీని అమ్మేయడంపై...ఆయన మరో ఛానల్ ప్రారంభిస్తున్నాడు అందుకే మాను అమ్మేసాడని  అనుకున్నారు. అంతేకాదు పీవీపీతో కలిసి ఈ ఛానెల్‌ నిర్మిస్తున్నట్టు కూడా అనుకున్నారు. ఈ విషయం కొందరు నాగార్జున చెవిన వేయడంతో వెంటనే... ‘మనం’ పేరిట తాను ఓ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ పెడుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశాడు. దీంతో ఈ ఛానెల్‌పై వస్తున్న గాసిప్స్‌ కు తెరపడినట్టైంది. ఈయన ప్రస్తుతం ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అంతే కాదు ఆయన కాన్సన్ట్రేషన్ అంతా ఇప్పుడు అఖిల్ డెబ్యూ మూవీ పైనే ఉందని సన్నిహితులు అంటున్నారు. తను షూటింగులో, తనయుల షూటింగులతో బిజీగా ఉన్న ఈయనకు ఇంకొక ప్రాజెక్టుపై ఆలోచించే తీరిక లేదని కూడా భావిస్తున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ