కేరెక్టర్ రోల్స్ ఉన్నా... పారితోషికం ఇచ్చుకోలేక... !

June 25, 2015 | 05:36 PM | 3 Views
ప్రింట్ కామెంట్
Actor_Nagarjuna_in_charector_roles_niharonline

ఒకప్పుడంటే నలుగురైదుగురు హీరోలే ఇండస్ట్రీని ఏలే వాళ్ళు... ఇప్పుడేమో హెవీ కాంపిటీషన్... మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు చొచ్చుకొస్తున్నారు. హీరోలుగా నిలదొక్కుకోడానికి ఇప్పుడు మెయిన్ హీరోలు కూడా ఆచీ తూచీ కథలను, డైరెక్టర్లను ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి. ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని సినిమా తీసినా... కలెక్షన్ల దగ్గర బోల్తా కొడుతున్నాయి సినిమాలు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ హీరోను పెడితే సినిమాలు నడుస్తాయి అనేది కొంత మేరకే పని చేస్తోంది... మరి వారికి ఇచ్చుకునే డబ్బు కూడా లెక్కలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడా ఆచీతూచీ ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ గా నటించడానికి ఇప్పుడు నాగార్జున రెడీగానే వున్నాడు. కానీ అలాంటి పాత్రల కోసం సంప్రదించడానికి జంకుతున్నారు నిర్మాతలు. అతను ఆ క్యారెక్టర్ చేస్తాడో లేడో అని కాదు.... క్యారెక్టర్‌ ఏదైనా సరే తను రెగ్యులర్‌గా ఎంత పారితోషికం తీసుకుంటాడో అంతే పారితోషికం ఇచ్చుకోవాల్సి వస్తుందని. ఒక క్యారెక్టర్‌ కోసం అయిదారు కోట్లు వెచ్చించే ధైర్యం చేయలేక నాగ్‌ జోలికి ఎవరూ వెళ్లడం లేదు. అలా నాగార్జునని అడుగుదామని అనుకున్న పాత్రలకి ఈమధ్య జగపతిబాబుని తీసుకున్నారట. నాగార్జున వుంటే సినిమాకి క్రేజ్‌ పెరుగుతుందనే మాట నిజమే అయినా పారితోషికం పరంగానే రిస్కు తీసుకోలేక వెనక్కి తగ్గారట. 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ