హలో బ్రదర్, ఎదురులేని మనిషి సినిమాల తరువాత నాగార్జున డ్యుయెల్ రోల్ లోనటిస్తున్న ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కొన్ని ముఖ్యమైన సీన్లు చిత్రించడం కోసం నాగార్జున, మరికొంతమంది ఆర్టిస్టులు మైసూరుకు వెళ్ళినట్లు యూనిట్ సభ్యులు తెలిపారు. నాగ్ సరసన రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠీ హీరోయిన్లుగా నటిస్తున్నట్టు తెలిసింది. ఈ చిత్రానికి కల్యాణకృష్ణ డైరెక్టర్‌గా పరిచయమవుతున్నారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రంలో యాంకర్ అనసూయ, ఐటెంగర్ల్ హంసానందిని కూడా ముఖ్య పాత్రలే పోషిస్తున్నారని తెలిసింది. ఇందులో నాగార్జున గ్రాండ్ ఫాదర్‌గా, గ్రాండ్ సన్‌గా ద్విపాత్రాభినయం చేస్తున్నాడని మొదట వార్తలు వచ్చినా, అందులో నిజం కాదనీ, ఇందులో నాగ్ తండ్రీకొడుకుల పాత్రల్లో నటిస్తున్నారని లావణ్య ఓ సందర్భంలో తెలిపింది. నాగ్, రామ్మోహన్.పి సంయుక్తంగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.