ఫేస్ బుక్, ట్విట్టర్ ప్రేమ కథల గురించి ఎన్నో వార్తలు వింటున్నాం... ఇలాంటి కథలతో సినిమాలు ఎన్నో వచ్చేస్తున్నాయి ఇప్పుడు. అలాంటి కథే నాగశౌర్య ది కూడా ఆ మధ్య ఈ చిత్రం గురించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు 'అబ్బాయితో అమ్మాయి' విడుదలయ్యాయి. తమాషా బొమ్మలతో విడుదలైన ఈ పోస్టర్లు మరో ప్రేమ కథ వస్తున్నట్టుందే అనుకున్నారంతా... ఫేస్ బుక్ లో జరిగే ఈ ప్రేమ కథా చిత్రంగా ఈ సినిమా సిద్దమవుతోంది. దర్శకుడు రమేష్ వర్మ మాట్లాడుతూ ప్రపంచం మొత్తం ఫేస్‌బుక్‌లోకీ, ట్విట్టర్‌లోకీ వచ్చేసింది. ఈ వేదికలపై అందమైన భావాల్ని వెలిబుచ్చుతోంది యువత. బయటి ప్రపంచంలో కంటే ఫేస్‌బుక్‌లోనే ఎక్కువమంది స్నేహితుల్ని సంపాదించుకొంటున్నారు. ఈ సాంకేతిక ప్రపంచంలో ఒకలా బయట మరోలా ప్రవర్తించేవాళ్లూ ఉన్నారు. అలాంటి ఓ అబ్బాయి, ఓ అమ్మాయి కథే మా సినిమా అంటున్నారు. నాగశౌర్య, పల్లక్ లల్వాని జంటగా నటించారు. వందన అలేఖ్య జక్కం, కిరీటి పోతిని, శ్రీనివాస్ సమ్మెట నిర్మాతలు. ఈ చిత్రం యువతరందే అయినప్పటికీ కుటుంబ ప్రేక్షకులకూ నచ్చుతుందంటున్నారు నిర్మాతలు. చిత్రం షూటింగ్ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తుందనీ డిసెంబర్ లో రిలీజ్ చేయబోతున్నట్టు చెప్పారు చిత్ర బృందం. బ్రహ్మానందం, రావు రమేశ్, మోహన్, ప్రగతి, తులసి, పృథ్వీ తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: శ్యాం కె నాయుడు, ఎడిటర్: ఎస్.ఆర్.శేఖర్, పాటలు: రహ్మాన్, ప్రొడక్షన్ డిజైనర్: బ్రహ్మ కడలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మురళీకృష్ణ కొడాలి.