నాగశౌర్యకు కళ్యాణమై పోతుందనుకుంటున్నారేమో అందరూ... కానీ లవర్ బాయ్ కి మరో లవ్ చిత్రం ఆఫర్ వచ్చింది. అది కూడా డైరెక్టర్ నందినీ రెడ్డితో.... అదే ఈ కళ్యాణ వైభోగమే... అలా మొదలైంది సినిమాతో మంచి డైరెక్టర్ అనిపించుకుంది నందినిరెడ్డి. ఆ చిత్రం హీరోయిన్ నానికి, నిత్యామీనన్ కి మంచి బ్రేక్ అయ్యింది కానీ, నందిని రెడ్డి ఆ చిత్రం తరువాత తీసిన చిత్రం డిజాస్టర్ అయ్యి, రెండేళ్ళ వరకూ సినిమా వంక చూడలేదు నందినీ రెడ్డి. ఇప్పుడు నాగశౌర్య, ఎవడే సుబ్రహ్మణ్యం నాయిక మాళవిక నయ్యర్ హీరోయిన్ గా తన అలా మొదలైంది లాంటి ఓ ప్రేమ కథను తెరకెక్కించబోతోంది నందినీ రెడ్డి. ఇక ఈ ప్రేమ కథకు నాగశౌర్య ఎలా ఉంటాడో కాలేజీ అమ్మాయిలను అడిగితే చెపుతారు. నందిని రెడ్డికి ఈ చిత్రం అలా మొదలైందంత హిట్ కావాలని కోరుకుందాం.