అక్కినేని వారి ‘మనం’ తరువాత సినీ కుటుంబాలు ఇలా తామూ ఒక సినిమా తీస్తే బాగుంటుందనే ఆలోచనలో పడ్డట్టుగా అనిపిస్తోంది. తామంతా కలిసి ఓ సినిమా చేయబోతున్నట్టు నందమూరి వారు ఒక సందర్భంలో ప్రకటించారు కూడా. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది. ఆ సినిమా అక్టోబర్ లో మొదలు పెట్టనున్నట్టు తెలుస్తోంది. నందమూరి వారి ఓ మల్టీస్టారర్ సినిమా మొదలు పెట్టబోతున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి వక్కంతం వంశి దర్శకత్వం వహించనుండగా, ఈ చిత్రాన్ని కళ్యాణ్ రాం నిర్మించనున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ కు ఈ కథ మాగా నచ్చినట్టుగా, వెంటనే ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. చాలా పకద్బందీ ప్లాన్ ప్రకారం ఈ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నట్టు, ఎన్టీఆర్ సుకుమార్ సినిమా అయిపోగానే ఈ సినిమాను మొదలు పెట్టనున్నట్టుగా సమాచారం. అయితే ఈ చిత్రాన్ని సంక్రాంతి 2016 లోగా పూర్తి చేసి రిలీజ్ చేయాలనే తలంపుతో ఉన్నారని కూడా తెలుస్తోంది. ఇక చిత్ర నిర్మాణానికి సంబంధించిన మరిన్ని వివరాలను ఆ చిత్ర యూనిట్ వెలువరించే వారకూ ఆగాల్సిందే...