నాని- మారుతి కాంబినేషన్లో ‘భలే భలే మగాడివోయ్’ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. జీఏ2 (గీతా ఆర్ట్స్ సంస్థలో భాగం) బ్యానర్ లొ అల్లు అరవింద్, యువీ క్రియేషన్స్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యమవుతోంది. సోమవారం ఉదయం ఫిలింనగర్ దైవసన్నిదానంలో పూజాకార్యక్రమాలు పూర్తిచేసుకుంది. సోమవారం నుంచే రెగ్యులర్ షూటింగ్ చేస్తున్నారు. అయితే ముందుగా అనుకున్నట్లు హీరోయిన్ గా బస్టాప్ ఫేం శ్రీదివ్యను కాకుండా లావణ్య త్రిపాఠిను ఎంపికచేశారు. నిర్మాత బన్నివాసు మాట్లాడుతూ ``మారుతి చెప్పిన కథ చాలా ఎంటర్టైనింగ్ గా వుంది. మారుతి గతంలో చేసిన చిత్రాలకంటే ఈ చిత్రం ఫుల్ అవుటండ్ అవుట్ లవ్ అండ్ ఫ్యామిలి ఎంటర్టైనర్ గా వుంటుంది. నాని, లావణ్య త్రిపాఠి లు హీరోహీరోయిన్స్ గా చేస్తున్నారు. ఈరోజు ఉదయం ఫిల్మ్‌నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దైవసన్నిధానంలో పూజాకార్యక్రమాలతో రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టాం. అల్లు అరవింద్ గారు స్వామివారిపై క్లాప్ ఇవ్వగా, ప్రముఖ నిర్మాత దిల్ రాజు గారు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు చిత్ర సంగీత దర్శకుడు గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి అగష్టు లో చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాము`` అని బన్నీవాసు తెలిపారు. దర్శకుడు మారుతి మాట్లాడుతూ ``చక్కటి ఎంటర్టైన్మెంట్ వున్న చక్కటి లవ్ స్టోరి. చక్కగా సినిమా అంతా నవ్వుకునే చిత్రం గా అందరి ప్రశంసలు పొందుతుంది`` అని అన్నారు. ఇంకా ఈ చిత్రంలో మురళి శర్మ, నరేష్, సితార, స్వప్న మాధురి, వెన్నెల కిషోర్, ప్రవీణ్, భద్రమ్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: ఎస్.కె.ఎన్, ఎడిటర్: ఉద్దవ్, ఆర్ట్ :రమణలంక, సంగీతం :గోపి సుందర్, ఫొటొగ్రఫి :నిజార్ షఫి, నిర్మాత :బన్నివాసు, రచన, దర్శకత్వం: మారుతి