నాని టూమచ్ చేస్తున్నాడా?

January 01, 2016 | 04:50 PM | 3 Views
ప్రింట్ కామెంట్
nani_charges_4_crore_remuneration_niharonline

మన కాలనీలో కుర్రాడిలా కనిపిస్తూ .. ఏ పాత్రలోనైనా ఎంతో సహజంగా నటించడం నాని ప్రత్యేకత. సహజ నటుడిగా (నేచురల్ స్టార్ ) గా యూత్ లో ఆయనకి మంచి ఫాలోయింగ్ వుంది. 'భలే భలే మగాడివోయ్' సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత నాని రేంజ్ కూడా బాగానే పెరిగిపోయింది. పెద్ద హీరోలకు కూడా కష్టసాధ్యమయ్యే 40 కోట్ల ఫీట్ ను అవలీలగా సాధించి గతేడాది టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాడు. ఇక ఈ హిట్ తరువాత ఆయన ఓ నిర్ణయం తీసుకున్నాడట. దాంతో నిర్మాతలు బెంబేలెత్తిపోతున్నారట.

కెరియర్ ప్రారంభం నుంచి వైవిధ్యభరితమైన సినిమాలను మాత్రమే ఆయన అంగీకరిస్తూ వస్తున్నాడు. అందువలన ఆయనకి మంచి గుర్తింపు లభించింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఆయన చేసిన 'భలే భలే మగాడివోయ్' సినిమా, తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లోను మంచి వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాతో ఆయనకి గల క్రేజ్ మరింత పెరిగింది. దాంతో వరుసగా అవకాశాలు వస్తుండటంతో ఆయన పారితోషికాన్ని పెంచాడట. గతంలో ఆయన ఒక సినిమాకి ఎంతమొత్తం అందుకున్నాడనే విషయం పక్కన పెడితే, ప్రస్తుతం ఒక్కో సినిమాకి 4 కోట్లు వసూలు చేస్తున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతానికైతే బాలయ్య అభిమానిగా అలరించేందుకు ముందుకు రాబోతున్నాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ