తుది దశలో ‘భలె భలె మగాడివోయ్’

May 06, 2015 | 02:18 PM | 159 Views
ప్రింట్ కామెంట్
nani_bhalebhale_magadivoy_niharonline

హీరో నాని, ఈ ఏడాది ‘జెండాపై కపిరాజు’, ‘ఎవడే సుబ్రమణ్యం’ చిత్రాలు  తర్వాత నాని చేస్తున్న చిత్రం ‘భలే భలే మగాడివోయ్’. గీతాఆర్ట్స్, యు.వి.క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని మారుతి డైరెక్ట్ చేస్తున్నాడు.  ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం తుది దశకు చేరుకుంది. అంతే కాకుండా హీరో నాని డబ్బింగ్ కూడా స్టార్ట్ చేసేశాడట. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుంది. సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న నాని ఈ చిత్రంపై చాలా ఆశలనే పెట్టుకున్నాడు. ‘కొత్త జంట’ తర్వాత మారుతి డైరెక్ట్ చేస్తున్న చిత్రమిది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ