యువతతో ఇంటరాక్ట్ అవుతున్న హీరో

March 26, 2015 | 04:05 PM | 61 Views
ప్రింట్ కామెంట్
nara_rohith_niharonline

ఈ హీరో ఆచీ తూచీ సినిమాలు తీస్తాడు... తన సినిమాలన్నీ కొత్తగా ఉండాలనుకుంటాడు... ప్రత్యేక స్ట్రేటజీ ఫాలో అవుతాడు... అందుకే ఈయన సినిమా వచ్చిందంటే ఎంతో కొంత మెసేజ్ ఉంటుందని అనుకుంటారు ప్రేక్షకులు. ఆ యువ హీరోనే నారా రోహిత్. ఆయన నటించిన రౌడీ ఫెలో, ప్రతినిధి రెండూ సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమాలే. వీటి తరువాత మరో రెండు సినిమాలు చేస్తున్నాడు. ఇవి కూడా చాలా కొత్తగా ఉంటాయనే భావనలో ప్రేక్షకులు ఉన్నారు. ఈ సినిమాల ఫస్ట్ లుక్ ను బట్టే ఇవి కూడా కొత్త రకమైన కథలతో, మరో మంచి మెసేజ్ తో తెరమీదకు వస్తున్నాడనే అంచనాలతో అభిమానులు ఈ సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈయన సినిమాలు అసుర, పండగలా వచ్చాడు రిలీజ్ కు సిద్ధమవుతున్నారు. అయితే ఈ హీరో యూత్ నాడిని టచ్ చేసి తన ఫాలోయింగ్ ను పెంచుకునే పనిలో పడ్డాడిప్పుడు. అందరూ సినిమాలు విడుదలకు ముందు ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంటే ఈ యువ హీరో ఆయన సినిమాలకు లాగానే కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నాడు. కొన్ని సెలెక్టివ్ కాలేజీలకు వెళ్ళి అక్కడ నేరుగా యువతతో ఇంటరాక్ట్ అవుతున్నాడు. ఆ కాలేజీల వారిషకోత్సవాల్లో పాల్లొంటున్నాడు. ఇంకా ఈ మధ్య యూఎస్ కూడా వెళ్ళి అక్కడి యువతను కూడా కలిసాడట. ఎప్పుడూ సోషల్ నెట్వర్క్ లో యాక్టివ్ గా ఉంటూ యువతకు చక్కని సమాధానాలిస్తూ వారి మనసు గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మొత్తానికి నారా రోహిత్ తెరముందూ, తెరవెనుక కూడా అందరి హీరోలకూ భిన్నమైనవాడే....

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ