రోహిత్ ఇంత స్పీడేంటి?

October 27, 2015 | 05:35 PM | 4 Views
ప్రింట్ కామెంట్
Nara-Rohit-New-Film-tuuntari-niharonline

నారా రోహిత్ ఇప్పటి వరకూ చేసిన సినిమాలన్నీ ఓ పవర్ ఫుల్ డైనమిక్ హీరో క్యారెక్టర్లు. అన్ని సినిమాలూ దాదాపు హిట్ లిస్టులోనే ఉన్నాయి. ఇటీవల రిలీజ్ అయిన అసుర మాత్రం అంతగా ఆడలేదు. అయితే ఈ హీరో ఇప్పుడు ‘తుంటరి’ క్యారెక్టర్ లో వచ్చేస్తున్నాడు. కానీ ఇప్పటి వరకూ సీరియస్ రోల్స్ లో చూసిన రోహిత్ ఈ క్యారెక్టర్ లో ఆడియన్స్ ను మెప్పిస్తాడో లేదో చూడాలి. 
అయితే ఈ ఇప్పుడు ఒకేసారి 9 సినిమాలు లైన్ లో పెట్టాడట. మొన్నటి వరకూ 6 సినిమాలు ఒకేసారి అనే వార్త చదివాం కానీ, ఇప్పుడు మళ్ళీ అడది 9కి చేరుకుంది. డిఫరెంట్ సినిమాలు విభిన్నమైన స్టోరీలతో ఆకట్టుకునే నారా రోహిత్ కి ఇంతలా సినిమాలకు ఎందుకు కమిట్ అవుతున్నాడు. నో అంటే ఆ స్టోరీలు పట్టుకుని మరో హీరో దగ్గరకు వెళ్ళిపోతారనా?  ప్రస్తుతం ఇతగాడు నటించిన తుంటరి మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది. తమిళ్ లో సూపర్ హిట్ అయిన మాన్ కరాటేకు రీమేక్ ఇది.  దీని తర్వాత ఈ హీరో చేయబోయే సినిమాలు... శంకర,  పండగలా వచ్చాడు, సావిత్రి, అప్పట్లో ఒకడుండేవాడు, వీరుడు,  కోటలో రాజకుమారి,  జో అచ్యుతానంద,  రాజా చెయ్యి వేస్తే అనే చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. నారా రోహిత్ తో సినిమా చేసేందుకు ఇంతలా ఎందుకు క్యూ కట్టేస్తున్నారు నిర్మాతలు అని ఫిల్మ్ ఇండస్ట్రీ ఆశ్చర్యంతో మునిగి తేలుతోంది.  ఈ 9 కాక మరో రెండు ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయట. మరి నారావారి హీరో సినిమాలకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారా? లేదా నిర్మాతలు ఈయన వెంట ఎందుకు పడుతున్నారంటారు?

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ