నారా రోహిత్ కొత్త చిత్రం వివరాలు...

June 24, 2015 | 02:59 PM | 0 Views
ప్రింట్ కామెంట్
nara_rohit_new_movie_niharonline

బాణం,సోలో, ప్రతినిధి, రౌడీ ఫెలో, అసుర వంటి డిఫరెంట్ చిత్రాలతో అలరిస్తున్న నారా రోహిత్ నెమ్మదిగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా కామ్ గా సినిమా స్టార్ట్ చేయడం, ముగించడం, విడుదల చేసుకుంటూ పోతున్నాడు. తాజాగా అప్పట్లో ఒకడుండేవాడు సినిమాని స్టార్ చేసిన నారా రోహిత్ ఈ నెల 27న పవన్ సాధినేని దర్శకత్వంలో చేయబోయే సినిమాని లాంఛనంగా ప్రారంభించనున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను సెప్టెంబర్ నుండి ప్రారంభిస్తాడని సమాచారం. హీరోయిన్ సహా మిగతా ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ