ఈ క్రిస్మస్ కి కాంపిటీషన్ ఉందండోయ్

December 09, 2015 | 02:55 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Mama-Manchu-Alludu-Kanchu-soukhyam-in-christmas-race-niharonline

పండగలు వచ్చాయంటే చాలు పెద్ద చిత్రాలను వదిలేందుకు నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటారు. అయితే ఈ సంవత్సరం నిర్మాతల మధ్య జరుగుతున్న చర్చలతో ఒక సినిమానికి మరో సినిమాకి దెబ్బ పడకుండా కాస్త గ్యాప్ తో రిలీజ్ చేసుకుని అన్ని చిత్రాలు లాభపడ్డాయి. ఇక మరికొన్ని రోజుల్లో ఈ ఏడాది ముగుస్తుండటంతో చివరి పండక్కి చిత్రాలు రెడీ అయిపోతున్నాయి. సాధారణంగా క్రిస్మస్ కి కాస్త పెద్ద చిత్రాల హడావుడియే ఉంటుంది. కానీ ఈ సంవత్సరం ప్రముఖంగా రెండు మీడియం బడ్జెట్ చిత్రాలు మాత్రమే పోటీలోకి దిగుతున్నాయి.

అందులో మొదటిది గోపీచంద్ కథానాయకుడిగా నటించిన 'సౌఖ్యం' చిత్రం విడుదలవుతోంది. ఫ్యామిలీ సెంటిమెంట్ ప్రధానంగా వస్తున్న ఈ చిత్రంలో కామెడీ, గోపీచంద్ మార్క్ యాక్షన్ కూడా అదనపు ఆకర్షణలు. హీరోహీరోయిన్లకు రెండేసి హిట్స్ తరువాత చేస్తోన్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు బాగానే వున్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలను బాగానే పెంచాయి.

ఇక హిట్ కోసం మోహం వాచి ఉన్న అల్లరి నరేష్ మామ మంచు - అల్లుడు కంచు తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. మోహన్ బాబు ఓ ప్రధాన పాత్రల పోషిస్తోన్న ఈ సినిమాకు వినోదభరిత చిత్రాలను తెరకెక్కించే శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహించాడు. అంతేకాదు అల్లరి నరేష్ కి ఇది 50వ సినిమా కావడం కూడా విశేషం. దీంతో ఎలాగైనా తన హిట్ దాహం తీర్చుకోవాలని నరేష్ ఉవ్విళ్లూరుతున్నాడు. వీటితోపాటు వారాహి బ్యానర్ పై రూపొందిన 'జతకలిసే' సినిమా కూడా ఇదే రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. మరి ఈ పోటీల్లో గెలుపు గుర్రం ఎవరనేదీ తెలియాలంటే క్రిస్మస్ దాకా ఆగాల్సిందే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ