అల్లరి నరేష్ నేడు (జూన్ 30) 33లోకి అడుగు పెట్టాడు. ఈ పుట్టిన రోజుకో ప్రత్యేకత ఉంది. అది తన భార్యతో కలిసి జరుపుకునే తొలి పుట్టనరోజు. అందుకే ఈ వేడుకను అల్లరి నరేష్ స్పెషల్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాడట. ఈ సందర్భంగా విరూప ఆయనతో కలిసి ఓ సెల్ఫీని పోస్టు చేసింది. ‘హ్యాపీ బర్త్ డే మై రియల్ లైఫ్ హీరో' అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది. తన పుట్టినరోజు సందర్భంగా అల్లరి నరేష్ తన తాజా సినిమా ‘జేమ్స్ బాండ్' రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈ సినిమాను జులై 17కు రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. అంటే బాహుబలి విడుదలైన వారం రోజుల తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందన్నమాట.