ఇంకొన్నాళ్ళలో పెళ్ళి చేసుకుంటారనుకున్న ఈ జంట పబ్లిక్ గా సినిమా ఫంక్షన్లకు చట్టాపట్టాలేసుకుని తిరిగింది. మరిఎందుకిలా బెడిసికొట్టిందో అది వారికే తెలియాలి. వీరి ప్రేమ బీటలువారిపోయింది. కొన్నాళ్ళకయినా సర్దుకునే చిన్న సమస్య కాదనిపించింది వీరిది. అందుకు ఉదాహరణే నయన తార మాట తీరు. నటుడు శింబుతో ప్రేమ విఫలం తొలి దెబ్బ కాగా నృత్య దర్శకుడు ప్రభుదేవాతో ప్రేమ, పెళ్లి పెటాకులు ఆమెకు చాలా గుణపాఠాలు నేర్పినట్లున్నాయి. అందుకే నటుడు శింబునైనా క్షమిస్తానుగాని ప్రభుదేవాను మన్నించేది లేదని ఖండితంగా చెబుతోంది. నయన్ కు టాలీవుడ్ సన్నిహితులు చాలా మందే ఉన్నారు. వీరి ప్రేమకు బ్రేక్ పడి చాలా కాలమైంది. ఇప్పుడు కొత్తగా ఓ వార్త వినిపిస్తోంది. ఇది ఎంతవరకు నిజమనేది వారి నోట వినాల్సిందే. రూమర్లు అలా అలా పాస్ అవుతూనే ఉంటాయి. అయితే నయనతారను మళ్లీ కలపాల్సిందిగా ఒక టాలీవుడ్ నిర్మాతను ప్రభుదేవా కోరారట. ప్రభు కోరిక ప్రకారం అతను నయనతారను కలిస్తే తానింకా తన జీవితాన్ని నాశనం చేసుకోవాలనుకోవడం లేదని, ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నానని ఆమె బదులిచ్చినట్టు సమాచారం. అంటే ప్రభుపై ఇంకా కోపం తగ్గలేదనేగా అర్థం.