నయనతార అప్పుడప్పుడూ వార్తల్లో ఉంటూనే ఉంది. కొన్నిసార్లు సినిమాకోసమైతే, మరికొన్ని సార్లు తన ప్రేమాయణంతో. ముందు శింబు, ఆ తర్వాత ప్రభుదేవా, మధ్యలో ఆర్య... ఇలా నయనతార ప్రేమ గురించి చాలా వార్తలే బయటికొచ్చాయి. తాజాగా ఆ కోవలో చేరిన పేరు విఘ్నేష్ శివన్. ఈయన తమిళ దర్శకుడు. తాజాగా విజయ్ సేతుపతితో `నానుమ్ రౌడీదాన్` అనే సినిమాను రూపొందిస్తున్నారు. ఆ సినిమాలో నయనతార నాయిక. ఈ సినిమా సమయంలోనే విఘ్నేష్, నయనతార మధ్య ప్రేమాయణం మొదలైందని వినికిడి. ఆ వార్తలు గుప్పుమనగానే ఇద్దరూ తూచ్ అన్నారు. కానీ ప్రేమను బయటకు చెప్పేసి వెంటనే పెళ్లి చేసుకోవాలని ఇటీవల నిర్ణయించుకున్నారట. ఆ మేరకు త్వరలో జరగనున్న ఆ సినిమా ఆడియో వేడుకలో ఈ విషయాన్ని ప్రకటించాలని నిర్ణయించుకున్నారట. అన్నీ సక్రమంగా జరిగి నయనతార ఓ ఇంటిదైతే చూడాలని చాలా మంది ఎదురుచూస్తున్నారట.