‘మాయ’కు ఐదు కోట్లా?

February 06, 2015 | 02:31 PM | 25 Views
ప్రింట్ కామెంట్

భయంలో ఆనందం వెతుక్కుంటున్నారు ఇప్పుడు ప్రేక్షకులు. అంటే కళ్ళు మూసుకుని కొద్ది కొద్దిగా చూస్తూ వణికిపోతూ, ముడుచుకుపోతూ, కేకలు పెడుతూ... ఇన్ని ఇబ్బందులున్నా సినిమా చూడ్డమన్న మాట. అదేనండీ హారర్ సినిమాల గురించిన ముచ్చట ఇది. నిజానికి స్టోరీ సరిగ్గా ఉండాలేగానీ హారర్ సినిమాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటూనే ఉంది. ముఖ్యంగా యువత హారర్ మూవీలను ఎక్కువగా చూడ్డానికి ఇష్టపడతారు. ఇటీవల వచ్చిన గీతాంజలిని హిందీలోకి రీ మేక్ చేస్తున్నారంటేనే తెలుస్తోంది వీటిపై ఉన్న క్రేజ్. ఇక తాజాగా ’మాయ’ అనే చిత్రానికి నిర్మాత మురళి 5 కోట్లు చెల్లించాడట. ఈ హారర్ చిత్రంలో నాయనతార నటించింది. అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో రూపొందిన తమిళ సినిమా ఇది. ఈ చిత్రంపై తమిళనాట భారీ అంచనాలే ఉన్నాయి. అందుకే దీనికి ఫాన్సీ రేటు చెల్లించి ఔట్ రేటుకి తీసేసుకున్నాడు ఈ నిర్మాత. ఈ యువ నిర్మాత ఎవరో కాదు ’తేనాండాల్ ఫిల్మ్స్ అధినేత రామనారాయణ్ తనయుడు. ఈ యువ నిర్మాత ఈ చిత్రం తప్పకుండా పెద్ద హిట్ అవుతుందనీ అందుకే దీనికి అంత రేటు చెల్లించానని చెపుతున్నాడు. ఇలాంటి సినిమాల్లో నేటించడం నయనతారకు ఇదే మొదటి సారి కావడంతో ఈ చిత్రం తన కెరీర్ కు భిన్నమైనదిగా నిలిచిపోతుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ