బాలీవుడ్ సినీ నటి నీనా గుప్త గుర్తండే ఉంటుంది. గుర్తులేకపోతే కల్ నాయక్ ‘చోలీకి పీచే క్యాహై’ గుర్తు చేసుకోండి. ఆవిడే నీనా గుప్త. అప్పట్లో పెళ్ళి కాకుండా ఓ కూతురుకు జన్మనిచ్చి సంచలనం సృష్టించింది. ఆ కూతురుకి తండ్రిని కూడా చెప్పలేదు చాన్నాళ్ళు (వి.వి.ఎన్.రిచర్డ్స్). ఆ అమ్మడే సంచలన పుత్రిక మసాబా గుప్త. ఇప్పుడు ఈవిడ పెళ్ళి కూతురైపోతోంది. ఈవిడని పెళ్ళి చేసుకోబోయేది ఎవరినో కాదు మన హైదరాబాద్ వాసి, ఒకప్పటి లియో మ్యూజిక్ కంపెనీ ఎండి, హిందీ గజనీ నిర్మాత మధు మంతెన. మసాబా గుప్త ముంబయిలో ఫ్యాషన్ డిజైనర్ గా మసాబా బ్రాండ్ నేమ్ తో దుస్తులను తయారు చేస్తోంది. ముంబైలోని జె.డబ్ల్యు,మారియట్ హోటల్ లో వీరి నిశ్చితార్థం గురువారం ఘనంగా జరిగింది. అయితే మసబా తండ్రి, క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ మాత్రం ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయాడు. పెళ్ళికి తప్పకుండా వస్తానని మెసేజ్ పంపాడట. బాలీవుడ్ సెలబ్రిటీలు అమీర్ ఖాన్ (గజనీ), షాహిద్ కపూర్ (మోసమ్), కరన్ జోహార్, రవీనా టాండన్, ప్రీతీ జింతా, సిద్దార్థ్ మల్హోత్రా, అలియాభట్, హ్యూమా ఖురేషీ వంటిముంబయి సెలబ్రిటీలే కాకుండా, నిర్మాత అల్లు అరవింద్ కూడా ఈ వేడుకలో పాల్గొని మసబా, మధు మంతెనలను శుభాకాంక్షలు అందించారు. మసబా, మధుమంతెన ఈ ఏడాది నవంబరులో వివాహం చేసుకోనున్నారట.