‘హ్యపీడేస్’ చిత్రంతో సినిమా రంగంలో ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో నిఖిల్ కి ‘యువత’ మాత్రమే మంచి సక్సెస్ ని ఇచ్చి మిగతావన్ని ఫ్లాప్ లు అయ్యాయి. అయితే ఆ తర్వాత ట్రెండ్ మార్చుకున్న ఈ యంగ్ హీరో ‘స్వామిరారా’, ‘కార్తికేయ’ వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ లున్న సినిమాలతో వరుస విజయాలను సాధించాడు. తాజాగా మరో డిఫరెంట్ స్టోరితో ‘సూర్య వర్సెస్ సూర్య’గా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాతో కార్తిక్ ఘట్టమనేని దర్శకుడుగా పరిచయం అవుతుండగా మల్కాపురం శివకుమార్ ఈ సినిమాని నిర్మించారు. కార్తీక్ ఘట్టమనేని కార్తీకేయ చిత్రానికి సినిమాటోగ్రఫర్ గా పనిచేశాడు. ఇక కార్తీకేయ దర్శకుడు చందు మొండేటి ఈ చిత్రానికి రచనా శాఖలో సహకారం ఇచ్చారు. సూర్య అనే యువకుడికి సూర్యుడంటే పడదు. అలాంటి వ్యక్తి ఎండలోకి రాకూడదు. అలాంటప్పుడు అతను ఏం చేశాడు? జీవితాన్ని ఎలా లీడ్ చేశాడు? అతని లవ్ కి ఎలాంటి సమస్యలు వచ్చాయి? అనేదే కథ. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్ ‘యూ’ సర్టిఫికేట్ పొందింది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కావడంతో సినిమా రిలీజ్ కి ఉన్న అడ్డంకులన్నీ క్లియర్ అయినట్లే లెక్క... ఇక ఈ చిత్రం మార్చి 5న(గురువారం) విడుదల కానుంది.