తాను పొట్టేనంటున్న నిత్య

May 09, 2015 | 04:38 PM | 65 Views
ప్రింట్ కామెంట్
nithya_menon_about_her_haight_niharonline

సాధారణంగా తమలో ఉన్న లోపాన్ని కప్పి పుచ్చుకుందామని చూస్తుంటారు చాలా  మంది. మరీ పొడవు విషయంలో అయితే ఓ రెండు మూడంగుళాలు ఎక్కువ చెప్పుకోడానికే ఇష్టపడతారు.  ఇందులో ఆడా మగా తేడా అనేది ఉండదు ఎవరైనా ఈ పద్ధతే ఫాలో అవుతుంటారు. అలాంటిది సెలబ్రిటీ.. అది కూడా సినిమా తార అయి ఉండి నిత్యా మీనన్ తన హైట్ విషయంలో ఏ మాత్రం దాపరికం లేకుండా చెప్పుకుంటోంది. ఇదే విషయాన్ని ‘గుండెజారి గల్లంతయ్యిందిల’లో నితిన్ నిత్యకు స్టూల్ వేసి నిల్చోమని తన పొట్టి తనాన్ని డైరెక్టుగా ప్రేక్షకులకు చూపించాడు కూడా... గుణశేఖర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రుద్రమదేవి చిత్రంలో అనుష్కతో పాటు నిత్యా మీనన్ కూడా నటించింది. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకొని, విడుదలకు సిద్ధంగా ఉంది. జులై నెలలో ఈ సినిమా విడుదల కానుందని తెలుస్తోంది. అయితే ఈ పోస్టర్స్ చూసినప్పుడు అందరూ అనుకున్న విషయం... అనుష్క పక్కన నిత్య ఎలా ఉంటుందని? నిత్యామీనన్ కాస్త ఎత్తు తక్కువే అన్న విషయం అందరికి తెలిసిందే. ఇందులో అనుష్క, నిత్యామీనన్ లు తల్లీకూతుళ్లుగా నటించారు. వీరిద్దరిపై ఓ పాటను కూడా చిత్రీకరించారు. ఆమెతో నటించినప్పుడు తాను భారీ హై హీల్స్ వేసుకొని నటించానంది నిత్య. అనుష్క కంటే తాను ఏడు అంగుళాలు పొట్టిగా ఉన్నానని కూడా చెప్పింది. అంత హీల్స్ వేసుకోవడం తన జీవితంలో మొదటిసారి అని, ఇవి వేసుకొని అనుష్కతో డాన్స్ చేస్తున్న సమయంలో తన కాలు బెణికిందని కూడా చెప్పింది. అనుష్క తనకు చాలా సహకరించిందనీ, తామిద్దరి భావాలు ఒకే విధంగా ఉన్నాయని చెప్పుకుంది నిత్య.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ