నిత్యామీనన్ ప్రేమ ఫిలాసఫీ

November 14, 2015 | 02:37 PM | 3 Views
ప్రింట్ కామెంట్
nithya-menon-condemns-love-affair-sudeep-niharonline

పొట్టిపిల్ల నిత్యామీనన్ కి యూత్ లో వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రేమను కళ్లతోనే పలికించడంలో ఆమెకి ఆమెనే సాటి అనే పేరును ఈ అమ్మడు ఎప్పుడో కొట్టేసింది. లవ్ ఫీల్ ను అంత అద్భుతంగా పండించే 27 ఏళ్ల ఈ సుందరి, లవ్ లో పడి ఉంటుందా? ఈ మధ్య కన్నడ స్టార్ నటుడు సుదీప్ తో పీకల లోతు ప్రేమలో ఉందని గాసిప్స్ వినిపించాయి. నిత్య తో అఫైర్ కారణంగానే సుదీప్ భార్యకు విడాకులు కూడా ఇచ్చాడని వార్తలు వచ్చాయి. దీంతో ఆమె మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకుంది. వాళ్ల సందేహాన్ని గ్రహించాను అన్నట్టుగా .. లవ్ లో పడ్డానని చెబుతోంది నిత్యామీనన్.

                        అయితే ఇది ఇప్పుడు కాదట. ఎప్పుడో తన 18 ఏటలో నట. ఆకర్షణ మాత్రమేనని తాను తెలుసుకోవడానికి ఎంతో కాలం పట్టలేదని అంటోంది. అతనితో జీవితం తాను ఆశించినట్టుగా ఉండదని గ్రహించిన వెంటనే తాను అ విషయాన్ని పక్కన పెట్టేశానని చెబుతోంది. ప్రేమించుకోవడం .. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడంలో తప్పులేదు. అయితే ప్రస్తుతం వున్న జీవితం కన్నా, ఆ తరువాత జీవితం మరింత ఆనందంగా ఉంటుందా .. లేదా? అనే విషయాన్ని మాత్రం ఆలోచించుకోవాలని అంటోంది. అలా అనిపించినప్పుడే తాను ప్రేమించడం .. పెళ్లి చేసుకోవడం జరుగుతాయనీ, ఇంత వరకైతే అలాంటి వారెవరూ తారసపడలేదని  ప్రేమ ఫిలాసపీ బాగానే చెబుతోందీ రింగు ఒత్తుల సుందరి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ