కేరళ కుట్టి టీనేజ్ లవ్ మాటర్....

July 06, 2015 | 04:22 PM | 4 Views
ప్రింట్ కామెంట్
Nithya_Menon_tean_love_niharonline

హీరోయిన్ అంటే కేవలం ఎట్రాక్షన్ కోసమో... లేక హీరోతో నాలుగు డాన్స్ లు చేయడానికా అన్నట్టు ఇప్పుడు తెలుగు సినిమాలు ఉంటున్నాయి. నటనకు పెద్దగా స్కోప్ లేకుండా పోతోంది వాళ్ళకు. ఇప్పుడు వచ్చిన హీరోయిన్లలో శృతి హాసన్ నే తీసుకున్నట్టయితే. వచ్చిన అన్ని సినిమాల్లోనూ ఆమెకు నటించడానికి ఏముందని? హీరోకి ఓ హీరోయిన్ అంతే... ఆ విషయాన్ని తండ్రి కమల్ హాసన్ ముక్కుసూటిగా చెప్పేశాడు కూడా. కానీ టాలీవుడ్, కోలీవుడ్ లలో వరస విజయాలను అందుకున్న నిత్యామీనన్ మాత్రం కాస్త నటనకు అవకాశం ఉన్న పాత్రలే వస్తున్నాయి. నిత్యా ఓ ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను 18 సంవత్సరాల వయస్సులో ఉండగానే నడిపిన ప్రేమ వ్యవహారాన్ని బయట పెట్టింది.  సినిమాలలోని ప్రేమ సన్నివేశాలలో తాను సహజంగా నటించడానికి తాను 18 సంవత్సరాల వయస్సులో నడిపిన ప్రేమ వ్యవహారం అనుభవాలు తనకు బాగా సహకరించాయని అందువల్లనే తాను ప్రేమ సన్ని వేశాలలో నటించేటప్పుడు సింగిల్ టేక్ తో తన సీన్స్ దర్శకుడికి నచ్చే విధంగా పూర్తి చేయగలుగుతున్నానని అంటూ తన టీనేజ్ లవ్ స్టోరీని బయటపెట్టింది నిత్య. అయితే ఆ ప్రేమ వ్యవహారం ముగిసిపోయి చాల సంవత్సరాలు గడిచిపోయానని అందువల్ల ఆ విషయాలు తనను అడగవద్దని అంటూ ఆ అనుభవాలు మాత్రం తనకు బాగా పనికి వచ్చాయి అని కామెంట్స్ చేసింది నిత్య. చాలామంది దర్శకులు తన కళ్ళతో అనేక భావాలు పలికిస్తూ ఎలా నటిస్తావు అని అడుగుతారని తన జీవితపు అనుభవాలు తన కళ్ళల్లో అనేక భావాలు పలికించేలా సహకరించాయని చెపుతోంది. విజయాలకు పొంగిపోవడం పరాజయాలకు కుంగి పోవడం తనకు చేతకాని పని అంటూ చెప్పుకొచ్చింది ఆ ఇంటర్వ్యూలో నిత్యా మీనన్.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ