నోరా పతేహి , ఈ పేరు తెలుగు సినిమా ప్రేక్షకులకు బాగా గుర్తుండే ఉంటుంది. ‘టెంపర్’ చిత్రంలో యంగ్ టైగర్ తో ఆడిపాడినఈ చిన్నది. తర్వాత వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. సురేందర్ రెడ్డి, రవితేజ కాంబినేషన్ లో వస్తోన్న ‘కిక్ 2’లో కూడా ఐటెమ్ సాంగ్ లో చిందేసింది. తాజాగా కళ్యాణ్ రామ్ హీరోగా కొమరం వెంకటేష్ నిర్మిస్తున్న ‘షేర్’ చిత్రంలో కూడా ఈ భామ ఆడిపాడుతుంది. ఈ సాంగ్ చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానుంది. పాటల చిత్రీకరణతో షేర్ చిత్రీకరణ పూర్తయినట్టే. సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తుంది. గతంలో తమ్ముడు ఎన్టీఆర్ తో ఐటెమ్ సాంగ్ చేసిన నోరా, తాజాగా అన్న కళ్యాణ్ రామ్ తో కూడా ఆడిపాడనుందన్నమాట.