ఉత్తర అమెరికా తెలుగు సంఘం 'నాట్స్' ప్రతి రెండేళ్లకొక్కసారి నిర్వహించే అమెరికా తెలుగు సంబరాలకు సన్నాహాలు ముమ్మరమయ్యాయి. జూలై లో లాస్ ఏంజిల్స్ వేదికగా జరిగే ఈ తెలుగు సంబరాల కోసం డాలస్ నగరంలో సంబరాల ఫండ్ రైజింగ్ కార్యక్రమం జరిగింది. దాదాపు 300 మందికి పైగా తెలుగువారు ఈ ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. లాస్ ఏంజిల్స్- అమెరికా తెలుగు సంబరాల కో కన్వీనర్ ప్రసాద్ పాపుదేశి సంబరాల్లో చేయనున్న కార్యక్రమాలను వివరించారు.. డాలస్ నుంచి ఇప్పటివరకు 2,07,000 డాలర్ల నిధులు ఈ ఫండ్ రైజింగ్ వల్ల వచ్చాయని నాట్స్ తెలిపింది. నాట్స్ చాఫ్టర్స్ లో ఇప్పటివరకు డాలస్ ఛాప్టర్ నుంచే ఇంత పెద్ద మొత్తంలో సంబరాలకు నిధులు వచ్చాయని డాలస్ నాట్స్ ఛాప్టర్ ప్రతినిధులు తెలిపారు. రెండేళ్లక్రితం డాలస్ నగరంలో అంగరంగ వైభవంగా అమెరికా తెలుగు సంబరాలను నిర్వహించుకున్న వైనాన్ని నాట్స్ సభ్యులు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు..జూలై 2 నుంచి 5 వరకు లాస్ ఏంజిల్స్ లోని అన్హమ్ సెంటర్ లో నిర్వహించనున్నారు. ఈ సంబరాలను అద్భుతంగా నిర్వహించేందుకు నాట్స్ డాలస్ టీం తమ వంతు సహకారం అందిస్తామని ప్రకటించింది. నాట్స్ ఫండ్ రైజింగ్ పిలుపు కు స్పందించిన ప్రతి ఒక్కరికి నాట్స్ ప్రత్యేక కృతజ్ఝతలు తెలిపింది.