ఇళయరాజా ఆస్పత్రి నుంచి డిస్ఛార్జ్

August 18, 2015 | 02:59 PM | 2 Views
ప్రింట్ కామెంట్
ilayaraaja_health_is_safe_niharonline

మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ వింటూ ఎన్నిగంటలైనా అలా గడిపేయ వచ్చు. అందుకే ఆయన వీరాభిమానులు ఈ ప్రపంచమంతా ఉన్నారు. నిరంతరం సంగీత సాధన తో ఇప్పటికి 5 వేలకు పైగా స్వరాల్ని సమకూర్చి చరిత్ర సృష్టించారు. తెలుగు, తమిళ్, హిందీలో ఆయన వందల సినిమాలకు పనిచేశారు. 72 వయసులోనూ ఆయన ఇప్పటికీ ఎన్నో అద్భుతమైన పాటలను అభిమానులకు అందిస్తున్నారు. ఇంతటి అభిమాన్ని చూరగొన్న ఈ సంగీత దర్శకుడు ఉన్నట్టుండి కుప్పకూలారు. ఈ వార్త దేశ విదేశాల్లో అభిమానుల్ని ఎంతో కలవరపెట్టింది. అసలు రాజాకి ఏమైంది? ఇప్పుడెలా ఉన్నారు? అన్న ఆతృత అభిమానులను నిలకడగా ఉండనివ్వడం లేదు. అయితే దీనికి ఇళయరాజా కజిన్ దర్శకుడు వెంకట్ ప్రభు క్లారిటీ ఇచ్చారు. ఇళయరాజా ఆరోగ్యం ఇప్పుడు కుదుట పడిందనీ, ఆస్పత్రినుంచి సోమవారం డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు. ఆగస్టు 15 రోజున ఆయనకి స్వల్ప అస్వస్థత కలిగింది. గ్యాస్ట్రిక్ సమస్య వల్ల కడుపునొప్పితో ఇబ్బంది పడ్డారనీ,  ఇప్పుడు క్షేమంగానే ఉన్నారని అన్నారు. ఇళయరాజా ఇటీవలే గురువు ఎం.ఎస్.విశ్వనాథన్ పై అభిమానంతో చెన్నయ్ లో సంగీత విభావరి నిర్వహించిన సంగతి  తెలిసిందే. 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ