పవర్ స్టార్ పవన్ కళ్యాన్ సర్దార్ సినిమా కోసం ఆయన ఫాన్స్ ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాన్ ఈ సినిమాలో అప్పటి గబ్బర్ సింగ్ లానే కనిపిస్తున్నారు. అయితే మొన్నటి వరకూ రామానాయుడు స్టూడియోలో లక్ష్మీరాయ్ తో చిందులేసిన పవర్ స్టార్ ఇప్పుడు ముఖ్యమైన ఫైట్ సీన్ల కోసం గుజరాత్ చేరుకున్నాడు. ఈ రోజు ఉదయం ఈ సినిమా బృందం గుజరాత్ చేరుకుని అక్కడ తాజా షెడ్యూల్ ను ప్రారంభించారు. ఈ షెడ్యూల్ ను అక్కడ పది రోజుల పాటు ప్లాన్ చేశారు. ఈ పది రోజులలో పవన్ కల్యాణ్ , విలన్ గ్యాంగ్ కి సంబంధించిన యాక్షన్ ఎపిసోడ్స్ ను చిత్రీకరించనున్నారు. ఇది హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్ అని చెబుతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన హైలైట్స్ లో ఈ యాక్షన్ సీన్స్ ఒకటని అంటున్నారు. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ను ఈ యాక్షన్ సీన్స్ ఒక రేంజ్ లో ఆకట్టుకుంటాయని చెబుతున్నారు. బాబీ దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కాజల్ కథానాయికగా అలరించనున్న విషయం తెలిసిందే. గతంలో వచ్చిన 'గబ్బర్ సింగ్'ని మించిన అంచనాలు ఈ సినిమాకి ఉన్నాయి. ఆ అంచనాలను అందుకోవడానికి దర్శకుడు బాబీ తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. మరి పవన్ ఫ్యాన్స్ ను ఆయన ఏ స్థాయిలో మెప్పిస్తాడో చూడాలి.